Begin typing your search above and press return to search.

మరోసారి చిరు దృష్టిలో పడేందుకు సోహెల్‌.. మెహబూబ్‌ ప్రయత్నం

By:  Tupaki Desk   |   31 Dec 2020 9:09 AM IST
మరోసారి చిరు దృష్టిలో పడేందుకు సోహెల్‌.. మెహబూబ్‌ ప్రయత్నం
X
తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 4 కంటెస్టెంట్స్‌ అయిన మెహబూబ్ మరియు సోహెల్‌ లు షో తర్వాత కూడ ఆ చాలా సందడి చేస్తున్నారు. ఫినాలే ఎపిసోడ్‌ రోజున వీరిద్దరికి నాగార్జున మరియు చిరంజీవిల నుండి పది లక్షల చొప్పున ఇద్దరికి కలిపి ఇరువై లక్షల రూపాయలు దక్కడంతో పాటు చిరంజీవి నుండి ప్రశంసల జల్లు కురిసింది. మెహబూబ్‌ కు చిరంజీవి తన ఆచార్య సినిమాలో చిన్న రోల్‌ ను ఇప్పించారని వార్తలు వస్తున్నాయి. ఇక సోహెల్‌ నటించబోతున్న సినిమాలో గెస్ట్‌ గా నటిస్తానంటూ చిరంజీవి హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. చిరంజీవి మరియు నాగార్జునల హామీతో సోహెల్‌ సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు.

మరోసారి చిరంజీవి దృష్టిని ఆకర్షించేందుకు గాను ఈ స్నేహితులు ఇద్దరు కూడా ఇటీవల చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్ కు రక్త దానం చేశారు. చిరంజీవి గారు బ్లడ్‌ బ్యాంక్‌ లో రక్తదానం తర్వాత వీరిద్దరు కూడా స్పందించారు. అవసరం ఉన్న వారికి మన రక్తం ఉపయోపడుతుంది అంటే చాలా ఆనందంగా ఉంది. ఆపదలో ఉన్న వారికి సాయంగా నిలుస్తున్నామంటే గొప్ప ఫీలింగ్ సంతృప్తిగా ఉందని మెహబూబ్‌ అన్నాడు. రక్తదానంతో చాలా సంతోసంగా ఉందంటూ సోహెల్‌ కూడా చెప్పుకొచ్చాడు. వీరిద్దరు ఒకేసారి రక్తదానం చేయడంతో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. దాంతో మళ్లీ వీళ్లు చిరంజీవి దృష్టిలో పడే అవకాశం ఉంది.