Begin typing your search above and press return to search.

హాన్సిక పెళ్లి ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాక్..!

By:  Tupaki Desk   |   11 Dec 2022 11:30 AM GMT
హాన్సిక పెళ్లి ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాక్..!
X
సౌత్ స్టార్ హీరోయిన్ హాన్సిక తన స్నేహితుడు సోహైల్ కతూరియాని పెళ్లాడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న జైపూర్ లో వీరి మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి నెల రోజులు ముందు నుంచే ఓ రేంజ్ లో హడావిడి చేయగా ఫైనల్ గా కుటుంబ సభ్యులు కొద్దిమంది సెలబ్రిటీస్ సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగింది.

హాన్సిక పెళ్లి ముచ్చట మొదలైన నాటి నుంచి మ్యారేజ్ పూర్తయ్యేంత వరకు ఖర్చు విషయంలో ఎలాంటి వెనకడుగు వేయలేదట. బయటకు వచ్చిన సమాచారం ప్రకారం హాన్సిక పెళ్లి కోసం దాదాపు 20 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు ముంబై మీడియా టాక్.

సెలబ్రిటీస్ తమ లైఫ్ లో జరిగే ఈ అద్భుత కార్యాన్ని ఘనంగా జరుపుకోవాలని అనుకుంటారు అందుకే ఖర్చు విషయంలో అసలు వెనక్కి తగ్గరు. జైపూర్ కోటల్లోనే సెలబ్రిటీస్ వివాహాలు జరుగుతుంటాయి.

అయితే హాన్సిక సోహైల్ ల మ్యారేజ్ మాత్రం మిగతా సెలబ్రిటీస్ మ్యారేజ్ ల కన్నా ప్రత్యేకంగా జరిగిందని తెలుస్తుంది. పెళ్లి మొదలైన నాటి నుంచి ముగింపు కార్యక్రమాల వరకు ఖర్చు దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవకూడదని ఫిక్స్ అయ్యారట. అందుకే అంత భారీగా ఖర్చు జరిగినట్టు తెలుస్తుంది.

అంతేకాదు హాన్సికని చేసుకున్నందుకు సోహైల్ కి భారీగానే ఆస్తి పాస్తులు అప్పచెప్పారట హాన్సిక పేరెంట్స్. స్టార్ హీరోయిన్ గా కోలీవుడ్ లో సూపర్ కెరీర్ కొనసాగించిన హాన్సిక తన సినిమాలతోనే బీభత్సంగా సంపాదించేసింది. ఇక ఫ్రెండ్ గా ఉంటూనే తన బిజినెస్ లో పార్ట్ నర్ గా ఉంటున్న సోహైల్ తోనే ఆమె ప్రేమలో పడటం వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఓకే అనడంతో హాసిక సోహైల్ ల మ్యారేజ్ జరిగింది.

పెళ్లి తర్వాత హాన్సిక సినిమాలు కొనసాగిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. పెళ్లి జరిగింది ఈమధ్యనే కాబట్టి ఎలా లేదన్నా ఆరు నుంచి ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తుందని అంటున్నారు. ఒకవేళ సినిమాలు కొనసాగించే ఛాన్స్ ఉంటే మాత్రం హాన్సిక ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు. ఈమధ్య సినీ తారలంత కూడా పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. సో వారిలో హాన్సిక కూడా ఉంటుందా లేదా అన్నది చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.