Begin typing your search above and press return to search.

ముస్లిం అయుండి అలా చేస్తావా?

By:  Tupaki Desk   |   28 Jun 2017 12:58 PM GMT
ముస్లిం అయుండి అలా చేస్తావా?
X
సోషల్ మీడియాలో జనాలు పక్కనోళ్లను.. ముఖ్యంగా సెలబ్రిటీలను విమర్శించేందుకు ఏదో ఒక కారణం వెతుక్కుంటూ ఉంటారు. అంతా ఓకే అనుకున్న దగ్గరే ఏదో ఒక పాయింట్ ను పీకి పట్టుకునే వారికి.. తమంతట తామే ఓ లీడ్ ఇచ్చేస్తే ఎలా ఉంటుందనే విషయం ఇప్పుడు సోహా ఆలీ ఖాన్ ను చూస్తే అర్ధమవుతోంది.

తాజాగా ఈమె సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేసింది. తను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని చెబుతూ.. తాను ఎంత ఆనందంగా ఉందో.. తన మొహంలో కనిపిస్తున్న వెలుగుల ద్వారా చెప్పింది సోహా ఆలీ ఖాన్. భర్త కునాల్ ఖేముతో కలిసి ఇచ్చిన పోజులు చాలామందినే ఆకట్టుకున్నాయి కానీ.. కొంతమందికి మాత్రం తెగ కోపం తెప్పించేశాయి. మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ.. షర్మిలా టాగూర్ ల కూతురు అయిన ఈమె.. ముస్లిం సాంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించకపోవడాన్ని ఆ సామాజిక వర్గానికి చెందిన వారు తప్పు పట్టారు.

ఈమె తల్లి బెంగాలీ కావడంతో.. సోహా కూడా అదే తరహా గెటప్ లో కనిపించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆమె మీద విరుచుకుపడ్డారు. 'ముస్లిం అయి ఉండి బొట్టు పెట్టుకుంటావా.. నిన్ను చూస్తే సిగ్గు పడాల్సి ఉంటుంది. నువ్వు అసలు ముస్లింవేనా' అంటూ ఆమెను నిలదీసేశారు. అంతే కాదు.. కనీసం ఈద్ పండుగకు శుభాకాంక్షలు చెప్పకపోవడాన్ని కూడా పలువురు తప్పు పట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/