Begin typing your search above and press return to search.

బాలీవుడ్ జంటకు పండంటి పాప

By:  Tupaki Desk   |   30 Sept 2017 11:26 AM IST
బాలీవుడ్ జంటకు పండంటి పాప
X
బాలీవుడ్ నటులు సోహా ఆలీ ఖాన్.. కునాల్ ఖేము.. రెండేళ్ల క్రితం పెళఅలి చేసుకుని ఒకటైన సంగతి తెలిసిందే. స్టార్ హీరో అయిన సైఫ్ అలీఖాన్ సోదరి అయిన ఈమె.. ఈ ఏడాది ప్రారంభంలోనే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రపంచానికి ప్రకటించింది. తన భార్య ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని తెగ సంబరపడిపోతూ చెబుతున్నాడు కునాల్ ఖేము.

తమ అభిమానులు.. ఫాలోయర్స్ తో ఈ విషయం షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన కునాల్ ఖేము.. "ఇంతటి అద్భుతమైన రోజున ఎంతో అందమైన ఆడపిల్ల పుట్టిందని చెబుతుంటే.. మా కాళ్లు నేల మీద ఆనడం లేదు. మీ ప్రేమకు ఆశీర్వాదాలకు ధన్యావాదాలు" అంటూ ట్వీట్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. నిజానికి సోహా ఆలీ ఖాన్ కంటే కునాల్ ఖేము వయసు 4 ఏళ్లు తక్కువ కావడం విశేషం. ఇదేమీ అభ్యంతరకరమైన విషయం కాదు కానీ.. ఇలాంటి జంటలు మన దగ్గర చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కునాల్ వయసు 34 ఏళ్లు కాగా.. సోహా ఆలీ ఖాన్ వయసు 38 సంవత్సరాలు.

2014జూలైలో అంగరంగ వైభవంగా పారిస్ లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. పటౌడీ కుటుంబానికి చెందిన వేడుక కావడంతో.. 2015 జనవరి 25న ముంబైలో అంతకంటే భారీగా పెళ్లి వేడుక నిర్వహించారు. ఇక సోహా ఆలీ ఖాన్ చివరగా థర్టీ ఫస్ట్ అక్టోబర్ మూవీలో కనిపిస్తే.. దీపావళికి రాబోతోన్న గోల్ మాల్ అగైన్ చిత్రం ద్వారా ఆడియన్స్ ను పలకరించనున్నాడు కునాల్ ఖేము.