Begin typing your search above and press return to search.

నన్ పై కేసు వేస్తున్న ఫిలిం మేకర్

By:  Tupaki Desk   |   28 July 2016 6:08 AM GMT
నన్ పై కేసు వేస్తున్న ఫిలిం మేకర్
X
హాట్ మోడల్ కం హీరోయిన్ ఇమేజ్ ఉన్న సోఫియా హయత్ ఈ మధ్య హఠాత్తుగా ఆధ్యాత్మిక రూట్ లోకి వెళ్లిపోయింది. ఏకంగా మహాశివుడుకి తానే జన్మనిచ్చానంటూ.. నన్ గా మారిపోయింది. తనకు దాని గైయా మదర్ సోఫియాగా అనౌన్స్ చేసేసుకుంది కూడా. ఇలా మారిపోవడం తన ఇష్టమే కానీ.. ఇప్పుడు ఓ సినిమాకి సమస్య వచ్చి పడింది.

ఓ ఏడాది క్రితం సోఫియా హయత్ 'సిక్స్ ఎక్స్' అనే సినిమాలో నటించింది. పలు కారణాలతో ఆ సినిమా రిలీజ్ ఆలస్యం కాగా.. ఇప్పుడా మూవీని తెరపైకి తెచ్చేందుకు పనులు పూర్తవుతున్నాయి. అయితే.. తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు కానీ.. సినిమాకి ప్రచారం చేసేందుకు కానీ ఆమె అంగీకరించడం లేదు. 'ఆమెను కలిసేందుకు చాలా సార్లు ప్రయత్నించినా ఉపయోగం లేదు. ఆమె నిరాకరించడంతో మేము వేరే డబ్బింగ్ ఆర్టిస్టుతో సినిమా పూర్తి చేయాల్సి వస్తోంది. తను ఫారిన్ వ్యక్తి, సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేయించుకోలేదు. అందుకే వాళ్లు ఏం చేయలేకపోతున్నారు. దీంతో మాకు జరిగిన నష్టానికి కోర్టుకు వెళుతున్నాం. ఈ సినిమా రిలీజ్ ఆపేందుకు సోఫియా ప్రయత్నిస్తుండడం విచారకరం' అంటున్నాడు దర్శకుడు చంద్రకాంత్ సింగ్.

ఇదంతా నిజమే అంటున్న సోఫియా.. ఆ సినిమా వాళ్లతో ఒప్పందాలు ఏడాది క్రితమే పూర్తయిపోయాయని చెబుతోంది. సినిమా రిలీజ్ తనకు ఇష్టం లేదని కూడా తేల్చేసింది.