Begin typing your search above and press return to search.
రౌడీ సంస్కృతిని రెచ్చగొడుతోన్న నయన్-విఘేష్!
By: Tupaki Desk | 23 March 2022 8:00 AM ISTనయనతార- విగ్నేష్ శివన్ జంటగా `రౌడీ పిక్చర్స్` నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే బ్యాన్ పై `పెబుల్స్`..`రాకీ` వంటి సినిమాల్ని నిర్మించి సక్సెస్ లు అందుకున్నారు. తాజాగా ఈ సంస్థ అధినేతలపై పోలీస్ కేసు నమోదైంది. కన్నన్ అనే సామాజిక వేత్త రౌడీ పిక్చర్స్ పై ఫిర్యాదు చేసారు. ప్రొడక్షన్ హౌస్ పేరు రౌడీ సంస్కృతిని ప్రోత్సహిస్తుందని వెంటనే ఆ సంస్థని నిషేధించాలని పోలీసుల్ని అభ్యర్ధించారు. తక్షణం నయనతార-విగ్నేష్ శివన్ లి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. ఈ వివాదంపై నయన్-విగ్నేష్ శివన్ ఇంకా స్పందిచలేదు.
ఇటీవలే రౌడీ పిక్చర్స్ తల అజిత్ హీరోగా `ఏకె-62` అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రౌడీ పిక్చర్స్ కి చెందిన కొందరు వ్యక్తులు భారీగా బాణా సంచా కాల్చి పబ్లిక్ లో హడావుడి చేసారుట. వారి సెలబ్రేషన్స్ తో చుట్టు పక్కల కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడిందిట. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల కారణంగా సామాన్యులకు ఇలాంటి ఇబ్బందులు తప్పలేదని కన్నన్ అనే సామాజిక వేత్త ఆగ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కోలీవుడ్ మీడియా లో కథనాలు వస్తున్నాయి.
రౌడీ పిక్చర్స్ నిర్వాహకులు ఇలా చేయడం తొలిసారి కాదని గతంలో ఇలాంటి ఇబ్బందులకు కాలనీ వాసులు గురయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నన్ విషయాన్ని సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేసినట్లు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో వాస్తవాలు ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది.
నయనతార-విగ్నేష్ శివన్ చాలా కాలంగా ప్రేమించుకుంటోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు కలిసే ఉంటున్నారు. పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారని ఇంకొంత మంది అంటున్నారు. ఆ సంగతి పక్కనబెడితే.. ఇద్దరు ప్రేమికులుగా దగ్గరైన తర్వాత `రౌడీ పిక్చర్స్` సంస్థని నిర్మించారు.
గత ఏడాది ఆగస్టులోనే రౌడీ పిక్చర్స్ సంస్థని స్థాపించారు. తొలి ప్రయత్నంగా `నెటిక్రాన్` అనే సినిమా నిర్మించారు. ఆ తర్వాత `రాకీ`..`కాతువాకులా రెండు కాదల్`.. `పెబ్లస్` చిత్రాల్ని నిర్మించారు. అలాగే ఓ గుజరాతీ సినిమాని నిర్మించారు. ప్రస్తుతం మరో రెండు..మూడు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. అజిత్ హీరోగా ఇటీవలే ఓ చిత్రాన్ని ప్రకటించారు. సదరు నిర్మాణ సంస్థలో తెరకెక్కుతోన్న తొలి భారీ బడ్జెట్ చిత్రం ఇదే. దీంతో టపాసులు పేల్చి హడావుడి చేసినట్లు తెలుస్తోంది.
ఇక నయనతార కోలీవుడ్..టాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవిగా నటిస్తోన్న `గాడ్ ఫాదర్` చిత్రంలో నయన్ హీరోయిన్ గా నటిస్తోంది. `సైరా నరసింహారెడ్డి` తర్వాత మరోసారి మెగాస్టార్ తో జత కడుతుండటం విశేషం.