Begin typing your search above and press return to search.
త్రిష అరెస్ట్! గురువును మించిన శిష్యురాలు?!
By: Tupaki Desk | 5 Sept 2021 2:00 PM ISTసౌత్ బ్యూటీ త్రిష స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ చెన్నయ్ చంద్రం తెలుగు-తమిళ పరిశ్రమల్లో రెండు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగింది. స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోలందరి సరసనా నటించింది. అయితే త్రిషలో ఈ కోణం గురించి కంటే తన అల్లరి వేషాలు వ్యక్తిగత వివాదాలు ప్రేమాయణాల గురించే యూత్ ఎక్కువగా గుర్తు చేసుకుంటుంది. నిజానికి తన కెరీర్ ఆరంభ దశలోనే త్రిష యువహీరోలతో ప్రేమాయణం సాగించడంపై ఎక్కువ చర్చ సాగింది. అప్పట్లోనే మెట్రో నగరంలో నడిరోడ్డుపై పెగ్ వేసి అల్లరి చేసిన వ్యవహారం అంతే సంచలనమైంది.
ఆ తర్వాత మెచ్యూరిటీతో వ్యవహరించి చాలా కాలం వివాదాలకు దూరంగా ఉంది. ఇకపోతే ఇటీవల త్రిష పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా... తనను అరెస్టు చేయాలని సమాజంలోని కొన్ని వర్గాలు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. త్రిష అరెస్ట్ దేనికి? అటే.. ఆమె చప్పల్స్ ధరించి మతపరమైన ప్రదేశంలో నడిచిందిట. సంబంధిత మతస్తుల హృదయాలు గాయపడ్డాయి. తనని అరెస్టు చేయాలని డిమాండ్ ఊపందుకుంది.
ప్రస్తుతం తన గురువు మణిరత్నం `పొన్నియన్ సెల్వం -1` లో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఇండోర్ లో ఉన్న పాత దేవాలయంలో షూటింగ్ జరుగుతోంది. త్రిష- ఐశ్వర్యారాయ్ లపై ఒకేసారి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో త్రిష చప్పల్స్ ధరించి ఆలయ ప్రాంగణంలో నడిచింది. ఆమె శివలింగం.. నంది మధ్య పాదరక్షలతో నడుస్తున్న చిత్రం కూడా వైరల్ అయింది. ఇప్పుడు దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదయ్యాయి. వాస్తవానికి షూటింగ్ స్పాట్‌లో ఎలాంటి ఛాయాచిత్రాలను తీసుకోకుండా గట్టి చర్యలు తీసుకుంటారు. కానీ ఇప్పటికీ ఈ వివాదాస్పద చిత్రం చిత్ర యూనిట్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. మణిరత్నం - సుహాసిని బృందాలకు తెలియకుండానే ఇది జరిగిందా? మరి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు క్షమాపణలు చెబుతారా? ఏం జరగనుందో వేచి చూడాలి. ఈ వివాదం నేపథ్యంలో త్రిష గురువును మించిన శిష్యురాలయినట్టేనా? అంటూ గుసగుసలు వైరల్ అవుతున్నాయి.
మత వివాదాల్లో మణిరత్నం కూడా..!
మనోభావాలు దెబ్బ తినడం.. మతపరమైన వివాదాలు ఇటీవల మరింత ఎక్కువైన వైనం ఆశ్చర్యపరుస్తోంది. `బొంబాయి` తర్వాత మళ్లీ మత వివాదంలో చిక్కుకుని మణిరత్నం ఇటీవల హెడ్ లైన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 90లలో `బొంబాయి` సినిమాతో మణిరత్నం సృష్టించిన ప్రకంపనాలు అన్నీ ఇన్నీ కావు. దేశంలో నాటి మత ఘర్షణల నేపథ్యంలో వాస్తవిక ఘటనలను ఎంచుకుని అందులో హిందూ ముస్లిమ్ ప్రేమకథను హృద్యంగా తెరపై ఆవిష్కరించి సంచలనాలకు తెర తీసారు. దాంతో బొంబాయి చిత్రం వివాదాస్పదమైంది. 1996 మార్చి 11న ఈ సినిమా రిలీజైంది. చాలా చోట్ల థియేటర్లపై దాడులు జరిగాయి. కొన్ని చోట్ల ముస్లిములు థియేటర్లను తగలబెట్టారు. మణిరత్నం ఇంటిపైనా దాడులు జరిగాయి. నాడు మణిరత్నం ఇంటికి పోలీస్ రక్షణ ఇవ్వాల్సొచ్చింది.
ఆ తర్వాత కూడా మణిరత్నం సినిమాలు చాలాసార్లు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల మరోసారి హిందూ-ముస్లిమ్ వివాదం తెరపైకొచ్చింది. తాజాగా `నవరస` చిత్రంపై ముస్లింలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. మణిరత్నం నిర్మించిన ఈ సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయి. టైటిల్ కి తగ్గట్టే తొమ్మిది రసాల ఆధారంగా తొమ్మిది లఘు చిత్రాలు ఈ సిరీస్ లో ఉన్నాయి. వీటికి అరవింద్ స్వామి- గౌతమ్ మీనన్- కార్తీక్ సుబ్బరాజ్- ప్రియదర్శన్ తదితరులు దర్శకత్వం వహించారు.
అయితే ప్రచారం కోసం పవిత్ర ఖురాన్ లోని పద్యాలను ఉపయోగించడంతో దానికి ముస్లిములు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈ 9 కథలలో ఒకదానిలో ఖురాన్ పద్యాల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఇది కొంతమంది ముస్లిమ్ సోదరులను కలవరపెట్టింది. రజా అకాడమీ అనే ముస్లిం సంస్థ సీరియస్ వార్నింగ్ వైరల్ అయ్యింది. డైలీ తంతి వార్తాపత్రికలో నెట్ ఫ్లిక్స్ తన సినిమా నవరస నుంచి ఖురాన్ పద్యం ప్రచురించింది. ఇది ఖురాన్ కు అవమానం. నెట్ ఫ్టిక్స్ ఇండియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు సంస్థలు డిమాండ్ చేశాయి.