Begin typing your search above and press return to search.

కామెంట్‌: ప్ర‌చారానికి టైమింగ్ ముఖ్యం

By:  Tupaki Desk   |   1 Nov 2015 5:30 PM GMT
కామెంట్‌: ప్ర‌చారానికి టైమింగ్ ముఖ్యం
X
ఏదైనా సినిమాకి హైప్ క్రియేట్ చేయాలంటే ప‌బ్లిసిటీ స్టంట్ ఓ రేంజులో ప్లాన్ చేయాలి. అప్ప‌టికే భారీ అభిమాన బ‌లం ఉన్న స్టార్ హీరోల సినిమాల‌కు ప్ర‌చారం చేసే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్‌. ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ నెట్‌ వ‌ర్క్ ప్లాట్‌ ఫామ్‌ పై ఓ రేంజులో ప్ర‌మోష‌న్ వ‌చ్చేస్తోంది. ఏదైనా టీజ‌ర్ లేదా టైటిల్ లేదా పోస్ట‌ర్ రిలీజ్ చేసిన‌ప్పుడు క్ష‌ణాల్లో ఇంట‌ర్నెట్‌ పై ఎగ‌బ‌డి మ‌రీ చూసేస్తున్నారు. గంట‌ల్లోనే వేలాది క్లిక్స్ వ‌చ్చి ప‌డుతున్నాయి. అందుకే ఇటీవ‌లి కాలంలో సామాజిక వెబ్‌ సైట్ ల‌ను ఓ ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సినిమాకి ఎంత క్రేజు ఉంది? అన్న‌ది ప‌రిగ‌ణించే వేదిక‌గా సామాజిక వెబ్‌ సైట్లు క‌నిపిస్తున్నాయి.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లింగుస్వామి ఈ విష‌యంపై మాట్లాడుతూ.. ఎవ‌రైనా ఇమేజ్ ఉన్న స్టార్ సినిమాకి సంబంధించి ఒక్కో అప్‌ డేట్‌ ని తెలివిగా స‌రైన టైమింగ్ చూసి ఆన్‌ లైన్‌ లో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీనివ‌ల్ల ఆ సినిమా కోసం ఎంత‌మంది ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు? అన్న‌ది తెలిసిపోతుంది... అని అన్నారు. అయితే పి.ఎ.రంజిత్ సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాకి సంబంధించిన టైటిల్‌ ని ఎలాంటి హైప్ లేకుండా చాలా సింపుల్‌ గా సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్ ప్లాట్‌ ఫామ్‌ పై రిలీజ్ చేసేశాడు. త‌న అధికారిక ట్విట్ట‌ర్‌ లో ఈ సినిమా టైటిల్ క‌బాలి అని అనుకుంటున్నామ‌ని పోస్ట్ చేశాడు. అయితే ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు అని లింగుస్వామి అంటున్నారు.

స్టార్ల సినిమాకి ప్ర‌చారం పూర్తి ప్ర‌ణాళిక‌తో సాగాల‌ని అన్నారు. అలాగే స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ చిత్రం తెర‌కెక్కిస్తున్న బాబినే ఇదే విష‌య‌మై ప్ర‌శ్నిస్తే.. నా వ‌ర‌కైతే మిడ్‌ నైట్ ప్ర‌చారం బాగా క‌లిసొస్తుంద‌ని న‌మ్ముతున్నా. సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్‌ లో మిడ్‌ నైట్ ప్ర‌చారం బాగా క‌లిసొస్తుంద‌ని న‌మ్ముతున్నా.. ఆ టైమ్‌ లో అంద‌రికీ ప్ర‌చారం చేరువ‌వుతోంద‌ని బాబి అన్నాడు.

త‌ళా విజ‌య్ న‌టించిన పులి చిత్రానికి, స‌ల్మాన్ న‌టించిన భ‌జ‌రంగి చిత్రానికి స‌మాజాకి వెబ్‌ సైట్ ల‌లో అద్భుత‌మైన ప్ర‌చారం వ‌చ్చింది. అలాగే త‌ళా అజిత్ న‌టించిన తాజా చిత్రం వేద‌లం కి అంతే ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. ఇదంతా సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్ సైట్ల‌లో ప్ర‌చారం తో వ‌చ్చిన‌దే. స‌రైన టైమింగుతో చేసిన ప్ర‌చారం వ‌ల్ల‌నేన‌ని అంటున్నారు.