Begin typing your search above and press return to search.

ర‌జినీ సార్.. మ‌రి సోష‌ల్ మీడియానేం చేస్తారు?

By:  Tupaki Desk   |   12 April 2017 8:03 AM GMT
ర‌జినీ సార్.. మ‌రి సోష‌ల్ మీడియానేం చేస్తారు?
X
రివ్యూ రైట‌ర్లు.. వెబ్ సైట్లు సంయ‌మనం పాటించాల‌ని.. సినిమా రిలీజైన మూడు రోజుల వ‌ర‌కు రివ్యూ ఇవ్వొద్ద‌ని.. వీకెండ్ అయ్యాక రివ్యూలు ప‌బ్లిష్ చేసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చాడు సూప‌ర్ స్టార్ రజినీకాంత్. ఐతే ఈ పోటీ యుగంలో అది సాధ్య‌మా అన్న‌ది ఇక్క‌డ ప్ర‌శ్న‌. ఎందుకంటే వెబ్ సైట్లు వంద‌ల్లో ఉన్నాయి. అంద‌రూ ఒక్క‌తాటిపై నిల‌వ‌డం అన్న‌ది సాధ్యం కాదు. ఒక‌రు వెన‌క్కి త‌గ్గితే ఇంకొక‌రు ముందుకెళ్లిపోతారు. ఒక‌వేళ రివ్యూ రైట‌ర్లంద‌రూ ఒక్క మాట‌పై నిలిచి రివ్యూల్ని ఆపేశారనే అనుకుందాం. మ‌రి సోష‌ల్ మీడియా ప‌రిస్థితేంటి? షో మొద‌ల‌వ‌డం ఆల‌స్యం. సీన్ సీన్ గురించి అప్ డేట్స్ ఇస్తూ.. తీర్పులిచ్చే నెటిజ‌న్ల మాటేంటి?

ఈ రోజుల్లో జ‌నాలు వెబ్ సైట్ల‌లో రివ్యూల కంటే ముందు ట్విట్ట‌ర్.. ఫేస్ బుక్కుల్ని చూస్తున్నారు. అక్క‌డ సినిమా హ్యాష్ ట్యాగ్ పెట్టి టాక్ ఏంటో తెలుసుకుంటున్నారు. అక్క‌డే జ‌నాల‌కు సినిమాపై ఒక ఐడియా వ‌చ్చేస్తోంది. మ‌రి ఈ సోష‌ల్ మీడియాను ఆప‌డం అన్న‌ది సాధ్య‌మా అన్న‌ది ర‌జినీ అండ్ కో ఆలోచించాలి. రివ్యూల వ‌ల్ల సినిమాల‌కు న‌ష్ట‌మ‌నే అనుకోవ‌డం పొర‌బాటు. చెడ్డ సినిమాకు రివ్యూలు చేటు చేస్తాయి కానీ.. మంచి సినిమాకు కాదు. సినిమా బాగుంటే రివ్యూ కూడా పాజిటివ్ గానే ఉంటుంది. దాని వ‌ల్ల సినిమాకు జ‌రిగే మేలు ఎంతో. సినిమాల‌కు మునుపెన్న‌డూ లేని హైప్ వ‌స్తోందన్నా.. క‌లెక్ష‌న్లు పెరిగాయ‌న్నా అందుకు మీడియా.. రివ్యూలు కూడా కార‌ణ‌మే. పెద్ద సినిమాల సంగ‌తి వ‌దిలేస్తే.. క్ష‌ణం.. పెళ్లిచూపులు లాంటి చిన్న సినిమాలు పెద్ద విజ‌యం సాధించాయంటే అందుకు కార‌ణం పాజిటివ్ రివ్యూలు.. వెబ్-సోష‌ల్ మీడియా ప్ర‌చారం వ‌ల్ల‌నే కదా? అయినా రివ్యూల దెబ్బ ప‌డేది చెత్త సినిమాల‌కే. అలాంటి సినిమాల నుంచి ప్రేక్ష‌కుల్ని ర‌క్షించ‌డం త‌ప్పు కాదు క‌దా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/