Begin typing your search above and press return to search.

కేవలం ప్రెస్ నోట్స్ మాత్రమేనా పవన్?

By:  Tupaki Desk   |   2 Feb 2017 6:30 PM GMT
కేవలం ప్రెస్ నోట్స్ మాత్రమేనా పవన్?
X
ఏ సినిమాకైనా కాంబినేషన్స్ చాలా కీలకం. కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే అలాంటివాటితో పని లేదు. పవర్ స్టార్ ఉండడమే పెద్ద అస్సెట్. హీరోయిన్.. డైరెక్టర్.. ప్రొడ్యూసర్.. ఇలాంటి కాంబినేషన్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పని ఉండదు. కానీ మన పవర్ స్టార్ మాత్రం.. కొన్ని కాంబినేషన్స్ గురించి స్పెషల్ గా ప్రెస్ నోట్స్ పంపించిన సందర్భాలు ఉన్నాయి. అంటే అఫీషియల్ గా ఈ సినిమాలు చేయబోతున్నాను అని అనౌన్స్ చేసినట్లన్న మాట.

స్టోరీలో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. రామ్ చరణ్ ని హీరోగా పెట్టి తను నిర్మాతగా ఓ సినిమా చేస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్. రెండు మూడేళ్ల క్రితం ఈ సంగతి చెప్పగా.. ఇప్పటివరకూ దీని ఊసే లేదనే విషయం స్పెషల్ గా ప్రస్తావించాల్సిన పని లేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో 'కోబలి'అనే సినిమా చేస్తానని.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉంటుందని చెప్పాడు పవన్. ఇప్పుడు పవన్-త్రివిక్రమ్ కాంబో ఖాయమైంది కానీ.. ఇది కోబలి మాత్రం కాదు. సో.. అప్పుడెప్పుడో చెప్పిన ప్రాజెక్ట్ ఇంకా పట్టాలు ఎక్కలేదన్న మాట.

ఇక రెండేళ్ల క్రితం నుంచి దాసరి నిర్మాణంలో ఓ సినిమా చేస్తానని చెప్పాడు పవర్ స్టార్. దీని సంగతి కూడా ఇంకా ఏమీ తేలలేదు. అసలు ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు. ఇదంతా చూస్తే పవన్ కళ్యాణ్ ప్రాజెక్టులు ప్రారంభించడం కంటే.. ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడంపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడు అని.. సుబ్బిరామిరెడ్డి- అశ్వినీదత్ లు నిర్మాతలు అని అంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రొడ్యూసర్ చెప్పినా.. చాలామంది నమ్మడం లేదు. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. పవన్ గతంలో చెప్పినవన్నీ చేసేసి.. ఇది కూడా చేస్తాడులే అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.