Begin typing your search above and press return to search.

'వారసుడు' ఫస్ట్ లుక్ తో ట్రెండింగ్ లో 'మహర్షి 2'..!

By:  Tupaki Desk   |   22 Jun 2022 7:30 AM GMT
వారసుడు ఫస్ట్ లుక్ తో ట్రెండింగ్ లో మహర్షి 2..!
X
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరియు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న #Thalapathy 66 చిత్రానికి ''వారసుడు'' అనే టైటిల్ ను ఖరారు చేసారు. తమిళ వెర్షన్ కు 'వారిసు' అని పేరు పెట్టారు. ఈరోజు దళపతి పుట్టినరోజు కావడంతో.. నిన్ననే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశారు.

'వారసుడు' ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సూటు, బూటు వేసుకుని చాలా స్టైలిష్ గా కనిపించాడు. అయితే ఈ పోస్టర్ పై నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇందులో 'మహర్షి' ఛాయలు ఉన్నాయని.. కొంపదీసి ఇది 'మహర్షి 2' కాదు కదా అని సెటైర్లు వేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన సినిమా ''మహర్షి''. బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న ఈ మూవీ.. నేషనల్ అవార్డ్ కూడా సాధించింది. అయినప్పటికీ మహేష్ సిల్వర్ జూబ్లీగా ఇలాంటి సినిమాని ఎక్సపెక్ట్ చేయని అభిమానులు.. వంశీ ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

'మహర్షి' పోస్టర్ లో కూడా మహేష్ సూటు బూటు ధరించి కనిపించాడు. ఇప్పుడు 'వారిసు' పోస్టర్ అదే మాదిరిగా ఉందని కామెంట్ చేస్తున్నారు. అందులో మహేష్ ఒక కంపెనీ సీఈఓ గా పనిచేస్తూ.. ఇండియాకు తిరిగొచ్చి తన స్నేహితుడి సమస్యను తీరుస్తాడు. ఇప్పుడు విజయ్ లుక్ ని బట్టి చూస్తే 'వారసుడు' సినిమాలో హీరో సీఈఓ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అంతేకాదు 'జర్నీ ఆఫ్ రిషి' మాదిరిగానే 'ది బాస్ రిటర్న్స్' అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఇక్కడ హీరో తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడానికి ఫారిన్ నుంచి ఇండియాకి వస్తాడని.. చూస్తుంటే ఇది 'మహర్షి 2' అయ్యేలా ఉందని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'వారసుడు' హ్యాష్ ట్యాగ్ తో పాటుగా 'మహర్షి 2' అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ట్రెండింగ్ లో మహర్షి 2 అని ఉన్నప్పటికీ.. అది ఓపెన్ చేస్తే ఆ ట్వీట్లలో మహర్షి పేరు ఎక్కడా ఉండటం లేదు. 'వారిసు' సినిమాకు సంబంధించిన అంశాలే ఉంటున్నాయి. దీంతో ట్విట్టర్ కూడా ఈ పోస్టర్ పై ట్రోలింగ్ చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

'వారసుడు' ఫస్ట్ లుక్ నేపథ్యంలో వంశీ పైడిపల్లి పేరు మరోసారి ఇలా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మున్ముందు ఇంకెన్ని పోలికలు పెడతారో చూడాలి. ఇకపోతే లేటెస్టుగా 'వారసుడు' నుంచి సెకండ్ లుక్ వచ్చింది. ఇందులో విజయ్ ఫస్ట్ లుక్ కి భిన్నంగా కనిపిస్తున్నాడు.

కాగా, 'వారసుడు' సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభు - శరత్ కుమార్ - ప్రకాష్ రాజ్ - జయసుధ - శ్రీకాంత్ - కిక్ శామ్ - యోగి బాబు - సంగీత - సంయుక్త షణ్ముగం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి - అహిషోర్‌ సాల్మన్‌ కథ - స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తోన్న 'వారసుడు' మూవీని 2023 పొంగల్ కి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.