Begin typing your search above and press return to search.

సరిలేరు గురించి సోషల్ మీడియా కామెంట్స్

By:  Tupaki Desk   |   31 May 2019 5:45 AM
సరిలేరు గురించి సోషల్ మీడియా కామెంట్స్
X
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ 26 టైటిల్ ని సరిలేరు నీకెవ్వరుగా ఫిక్స్ చేస్తూ టీం అఫీషియల్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది ముందు నుంచి ప్రచారంలో ఉన్నదే అయినప్పటికీ రెడ్డి గారి అబ్బాయి అనే మరో పేరు కూడా ప్రచారంలో ఉండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తానికి మహేష్ పర్సనాలిటీకి తగ్గ టైటిల్ అని ప్రేక్షకులూ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా దీని స్టొరీ లైన్ గురించి సోషల్ మీడియాలో అప్పుడే పలు ఆసక్తికరమైన కామెంట్స్ మొదలైపోయాయి.

స్టొరీ లైన్ కొంచెం అతడుకి దగ్గరగా ఉంటుందని లీక్స్ ని ఆధారంగా చేసుకుని దాన్ని హై లైట్ చేస్తున్నారు. క్లియర్ గా చెప్పాలంటే మిలిటరీలో చనిపోయిన స్నేహితుడి కోసం రాయలసీమలోని అతడి ఊరికి వచ్చి కుటుంబాన్ని ఆ ప్రాంతాన్ని తన చేతుల్లోకి తీసుకోవడమే థీమ్ గా చెబుతున్నారు. వెంటనే మహర్షి క్లిక్ అవుతోంది కదూ. కాకపోతే అందులో అల్లరి నరేష్ బ్రతికే ఉంటాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన మహేష్ ఊరిని బాగు చేస్తాడు. ఇందులో పెద్దగా అపోజిషన్ ఉండదు.

కాని సరిలేరు నీకెవ్వరులో జగపతిబాబుతో పాటు పవర్ ఫుల్ పాత్రలో విజయశాంతి కూడా ఉంటారట. ఇందులో నిజం ఎంతుందో కాని చర్చ మాత్రం మహా జోరుగా సాగుతోంది. అసలు అతడునే వెంకటేష్ వారసుడొచ్చాడు స్ఫూర్తిగా తీసుకున్నది. ఆఫ్ కోర్స్ అదీ తమిళ రీమేకే. ఇప్పుడు మళ్ళి అలాంటి లైన్ మీదే సరిలేరు నీకెవ్వరు ఉంటుందనటం ఆశ్చర్యమే. ఇందాకా ముహూర్తం క్లాప్ కొట్టేసుకున్న ఈ మూవీకి సంబంధించి ఇలాంటి ప్రచారాలు ముందు ముందు ఇంకెన్ని చూడాలి