Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : తెనాలి అమ్మడి హాలీవుడ్ ఫోజ్
By: Tupaki Desk | 7 Dec 2021 11:00 PM ISTతెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా పనికి రారు అనేది టాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్స్ అభిప్రాయంగా పడిపోయినట్లుగా ఉంది. అందుకే అన్ని భాషలకు చెందిన అమ్మాయిలు తెలుగు లో స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతున్నారు. కాని గడచిన పాతికేళ్లుగా తెలుగు అమ్మాయిలు ఎవరు కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోలేదు. వారు ఏ విధంగా చేసినా ఎలా చేసినా కూడా వారికి నిరాశ తప్పడం లేదు. కాని ఇతర భాషల్లో మాత్రం మన ముద్దుగుమ్మలకు మంచి గుర్తింపు వస్తుంది. అంజలి తెలుగు లో గుర్తింపు దక్కించుకోలేక పోయింది కాని తమిళంలో మాత్రం ఆమె స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఆ తర్వాత శోభిత ధూళిపాల కూడా అంజలి మాదిరిగానే బయట గెలిచింది.
బాలీవుడ్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన శోభిత అక్కడ వరుసగా మూడు సినిమాలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు లో గూఢచారి సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యింది.. శోభితకు మంచి పేరు వచ్చింది. కాని ఆఫర్లు మాత్రం ఆమెకు రాలేదు. ఏం చేసినా ఎన్ని చేసినా అన్నట్లుగా ఈమెకు టాలీవుడ్ లో ఆఫర్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వెబ్ సిరీస్ లేదా చిన్న సినిమాలు తప్ప పెద్ద ఆఫర్లు రావడం లేదు. ఆఫర్లు రావడం లేదనే నిరుత్సాహం చెందకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా లో షేర్ చేసిన ఈ ఫొటోలు ఆమె రేంజ్ టాలీవుడ్ కాదు హాలీవుడ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ వారు ఈమెను పట్టించుకోకున్నా బాలీవుడ్ లో మంచి గుర్తింపు రావడం.. అక్కడ వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు చేసే అవకాశాలు రావడం జరుగుతుంది. కనుక ఆమె టాలీవుడ్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. తనకు తోచిన విధంగా తాను పని చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా ఈ అమ్మడు ఒక ఇంగ్లీష్ సినిమా లో కూడా నటించేందుకు సిద్దం అయ్యింది. కనుక ఈ అమ్మడు హాలీవుడ్ రేంజ్ అనడంలో తప్పేం లేదు. తెలుగు తమిళం హిందీ ఇంగ్లీష్ ఇలా ఒకే సారి ఇన్ని భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఫ్యూచర్ లో ఓ రేంజ్ ఆల్ రౌండర్ అవుతుందనే నమ్మకంను కొందరు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.