Begin typing your search above and press return to search.

నా కెరీర్లో ఇద్దరు జఫ్ఫాలు తగిలారు!

By:  Tupaki Desk   |   31 July 2018 7:12 AM GMT
నా కెరీర్లో ఇద్దరు జఫ్ఫాలు తగిలారు!
X
మోడలింగ్ లో అడుగుపెట్టి మిస్ ఇండియా కిరీటం సాధించడమే కాకుండా - బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇప్పుడు 'గూఢచారి' తో తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతోంది. త్వరలో మలయాళం ల్యాండ్ లో కూడా నివిన్ పౌలీ సినిమా తో కాలుమోపనుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది ఈ తెలుగు బ్యూటీ.

సహజంగా గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నారంటే డ్రింక్ చేస్తారనే అభిప్రాయం ఉంటుంది. కానీ శోభిత మాత్రం తను కావాలనే దానికి దూరంగా ఉన్నానని చెప్తోంది. దానికి కారణం ఒకసారి కనుక మొదలుపెడితే అపలేదట. అందుకే ఆ అలవాటుకు దూరంగా ఉన్నానంటోంది. తన మోడలింగ్ కెరీర్ గురించి మాట్లాడుతూ ఫెమినా మిస్ ఇండియా కీరిటం సాధించాక కింగ్ ఫిషర్ 2014 క్యాలెండరు మోడల్ గా అవకాశం వచ్చిందని... అప్పుడు నెర్వస్ గా ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగేసి ఆ అవకాశాన్ని అందుకున్నానని చెప్పింది.

అంతే కాదు తన మోడలింగ్ - ఫిలిం కెరీర్ లో ఇద్దరు జఫ్ఫాలు తగిలారని.. కానీ వాళ్ళ వల్ల కూడా కొంత మంచే జరిగిందని అంటోంది. అలాంటి వాళ్ళ వల్లే ఇప్పుడు తను మరింత కాన్ఫిడెంట్ గా మారిందని - జనాల అభిప్రాయాల కంటే తన మనస్సు చెప్పేదే ముఖ్యమని తెలుసుకున్నానని చెప్పింది. శోభిత మాటలు తెలుగు బ్యూటీ విత్ అల్ట్రా-మోడరన్ టచ్ అనిపించడం లేదూ..?