Begin typing your search above and press return to search.

తెలుగమ్మాయి జోక్ చూశారా??

By:  Tupaki Desk   |   14 Dec 2016 7:30 AM GMT
తెలుగమ్మాయి జోక్ చూశారా??
X
తెలుగమ్మాయి.. అందులోను మన తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ.. 2013లోనే మిస్ ఇండియా కిరీటం దక్కించేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఈమె కెరీర్ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. భరత నాట్యంతో పాటు కూచిపూడితో సహా క్లాసికల్ డ్యాన్స్ లను అవపోసన పట్టేయడంతో అమ్మడికి మోడలింగ్ లో కానీ.. సినిమాల్లో కానీ అవకాశాలకు కొదువ ఏమీ లేదు.

ఇప్పటికే అనురాగ్ కశ్యప్ మూవీ రమన్ రాఘవ్ 2.0లో నటించి సక్సెస్ కొట్టడమే కాదు.. మొత్తం మూడు సినిమాల డీల్ సైన్ చేసింది కూడా. ఇంత రేంజ్ ఉన్న శోభితా.. సడెన్ గా ఓ టాప్ క్లాస్ జోక్ పేల్చింది. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ ఓ ఫోటో పోస్ట్ చేసింది. అందులో ఈమె ఓ రోడ్ సైడ్ స్టాల్ లో పావ్ భాజీ వేస్తోంది. తినడానికి వెళ్లినపుడు ఏదో సరదాగా ట్రై చేసి ఉంటుందిలే అని సరిపెట్టుకుందామంటే.. అసలు అప్పుడు వేసింది శోభిత. ఏకంగా కెరీర్ బ్యాకప్ అనేసింది ఈ మిస్ ఇండియా. సినిమాల్లో తేడా వస్తే పావ్ భాజీ బండి నడుపుకోవచ్చని ప్రాక్టీస్ చేస్తున్నా అన్నది ఈ పాప భావం.

ఈ రేంజ్ సెలబ్రిటీలు ఇలాంటి జోక్స్ వేస్తే బాగానే పేలతాయ్ కానీ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు సినిమాకు కూడా సైన్ చేసింది. అడివి శేష్ హీరోగా రూపొందే ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శోభిత ధూళిపాళ.. టాలీవుడ్ అరంగేట్రంపై తెగ ఖుషీ అయిపోతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/