Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఈ స్టోరీ పాతదేగా!!

By:  Tupaki Desk   |   24 Nov 2016 5:30 PM GMT
ఫోటో స్టోరి: ఈ స్టోరీ పాతదేగా!!
X
అది 2013. మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది.. బాంబేలో సెటిల్ అయిన ఒక తెలుగమ్మాయి. ఈమె మిస్ బెంగుళూరు పతాకం గెలుచుకుని.. అటునుండి ఈ మిస్ ఇండియా పోటీల్లో జయకేతనం ఎగరేసింది. ఇక 2014 వచ్చింది. అమ్మడు ఈ ఊపులో పాపులర్ కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై ఫోజులిచ్చేసింది. 2014 జూన్ నెల పేజీలో అమ్మడి బొమ్మలను అచ్చేశారు. ఆ అమ్మడి పేరే శోభితా ధూలిపాళ. అయితే ఈ న్యూస్ అంతా తెలిసిందేగా ఇప్పుడెందుకు చెబుతున్నారు.. అంటారా? దానికి ఓ లెక్కుంది. పదండి చూద్దాం.

నిజానికి అప్పట్లో శోభిత ఆ క్యాలెండర్ కోసం వివిధ బికినీల్లో.. కొన్ని టూ పీస్.. కొన్ని సింగిల్ పీస్.. వేసుకుని తెగ ఫోటోలు దిగేసింది. వీటిలో బ్లూ కలర్ లేస్ బికినీ వేసుకుని అమ్మడు దిగిన ఫోటో ఒకటి తీసుకుని.. ఇప్పుడు తెలుగు మీడియాలు నానా రచ్చా చేస్తున్నాయి. అదిగో శోభిత కొత్త ఫోటో చూడండహో అంటూ టముకు వేస్తున్నారు. కాని నిజానికి అది 2013లో తీసిన 2014 క్యాలెండర్ తాలూకు ఫోటో. సరిగ్గా ఆ ఫోటో బయటకు వచ్చిన మూడు సంవత్సరాల తరువాత శోభిత సినిమాల్లోకి అడుగుపెట్టింది. కాని ఆ ఫోటో ఏదో ఇప్పుడే దిగినట్టు రచ్చేంది నాయనలారా!!

ఇకపోతే ఆల్రెడీ అడివి శేష్‌ తదుపరి సినిమాలో శోభిత దూళిపాళ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/