Begin typing your search above and press return to search.

తెలుగు మిస్ ఇండియాకు పెద్ద ఛాన్సే

By:  Tupaki Desk   |   6 Aug 2016 6:04 AM GMT
తెలుగు మిస్ ఇండియాకు పెద్ద ఛాన్సే
X
మిస్ ఇండియా ఎర్త్ గా 2013లో ఎంపికైన శోభిత ధూలిపాళ గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే తెలుగులో ఈమెకు పెద్దగా అవకాశాలు ఎవ్వరూ ఇవ్వట్లేదనే విషయం కూడా తెలిసిందే. కాకపోతే ఈ భామ ఈ మధ్యనే బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి ఇప్పుడు ఏకంగా అక్కడ నాలుగు సినిమాలు సైన్ చేసింది.

రమన్ రాఘవ్ 2.0 సినిమాలో చూపిన నటనకుగాను.. ఆల్రెడీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈమెతో 3-సినిమాల-డీల్ సంతకం చేశాడు. ఇప్పుడు 'ఢిల్లీ బెల్లీ' సినిమా డైరక్టర్ అక్షత్ వర్మ తీస్తున్న కొత్త సినిమా ''కాలిగంది'' సినిమాలో కూడా హీరోయిన్ గా శోభితనే తీసుకున్నారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ సైఫ్‌ ఆలీ ఖాన్ చేస్తుండగా.. శోభిత మాత్రం కునాల్ రాయ్ కపూర్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. కాకపోతే ఈ సినిమా హిట్టయితే మాత్రం ఈ అమ్మడి రేంజ్ ఖచ్చితంగా మారిపోతుంది అంటున్నారు ఫిలిం ఎనలిస్టులు. ఎందుకంటే సైఫ్‌ సినిమా కాబట్టి దీని రిలీజ్ స్పాన్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి అమ్మడికి సక్సెస్ రేంజ్ ఎక్కువగా వచ్చే ఛాన్సుందిలే.

మరి బాలీవుడ్ లో పెద్ద స్టార్ అయ్యాక తెలుగు సినిమాల్లో ఛాన్సులు వస్తాయంటారా? ఏమో చెప్పలేం.