Begin typing your search above and press return to search.

తెలుగమ్మాయికి మరో బిగ్గెస్ట్‌ ఛాన్స్‌

By:  Tupaki Desk   |   27 July 2020 2:00 PM GMT
తెలుగమ్మాయికి మరో బిగ్గెస్ట్‌ ఛాన్స్‌
X
తెలుగమ్మాయిు హీరోయిన్‌ గా సక్సెస్‌ కాలేరు. ముఖ్యంగా టాలీవుడ్‌ లో వారికి కనీసం మెయిన్‌ హీరోయిన్‌ గా కూడా ఆఫర్లు రావంటూ టాక్‌ ఉన్న సమయంలో శోభిత దూళిపాల అనూహ్యంగా దూసుకు వచ్చింది. తెలుగమ్మాయి అయిన ఈమె బాలీవుడ్‌ లో సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కాని ఈమె మాత్రం రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట కూడా గెలిచింది. ప్రస్తుతం బాలీవుడ్‌ ఆఫర్స్‌ తో పాటు పలు హిందీ వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తూ ఉంది. ఈ సమయంలో ఈమెకు సౌత్‌ బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌ లో ఛాన్స్‌ దక్కింది.

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన పొన్నియిన్‌ సెల్వన్‌ లో శోభితకు ఛాన్స్‌ దక్కినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాని సినీ వర్గాల్లో మాత్రం శోభిత ఈ ఆఫర్‌ దక్కించుకున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. ఆమె కూడా అనధికారికంగా ఈ విషయాన్ని ఒప్పుకుంటుందట. సౌత్‌ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న ఈ చిత్రంలో విక్రమ్‌.. ఐశ్వర్య రాయ్‌.. కార్తీ.. జయం రవి ఇంకా పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా కనిపించబోతున్నారు.

ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఈ హేమా హేమీలతో శోభిత కూడా కలిసి నటించబోతుంది. హీరోయిన్‌ గా ఛాన్స్‌ ల కోసం తెలుగమ్మాయిలు తిగుతున్న సమయంలో మణిరత్నం వంటి బిగ్గెస్ట్‌ డైరెక్టర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లో ఛాన్స్‌ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా ఆమె ప్రతిభకు పట్టంగా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఆ సినిమాలో శోభిత పాత్ర ఏంటీ ఎలా కనిపించబోతుందని ఆసక్తికరంగా ఉంది.