Begin typing your search above and press return to search.

స‌మంత‌ పై శోభిత అలా.. చైతూని కూడా ఇలా అంది!

By:  Tupaki Desk   |   25 Jun 2023 2:30 PM IST
స‌మంత‌ పై శోభిత అలా.. చైతూని కూడా ఇలా అంది!
X
శోభితా ధూళిపాళ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ తెలుగ‌మ్మాయి హిందీ ప‌రిశ్ర‌మ‌లో హ‌వా సాగిస్తోంది. అడ‌పాద‌డ‌పా తెలుగు సినిమాల్లో న‌టిస్తూనే అటు ఉత్త‌రాదిన భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఇటీవ‌ల అక్కినేని నాగ‌చైత‌న్య‌తో ఎఫైర్ సాగిస్తోందంటూ వ‌రుస క‌థ‌నాలు రావడం సంచ‌ల‌న‌మైంది.

చైతన్య -శోభిత ఇరువురు త‌మ‌ సంబంధాన్ని ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు. ఈ జంట‌ వ్యక్తిగత జీవితాలపై ర‌క‌ర‌కాల‌ ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. అయినా వేటికీ శోభిత కానీ చై కానీ స్పందించ‌లేదు.

తాజా ఇంట‌ర్వ్యూలో నాగ‌చైత‌న్య గురించి స‌మంత గురించి శోభిత‌కు ప్ర‌శ్న ఎదురైంది. శోభిత స్పందిస్తూ ఎంతో హుందాగా ఆ ఇరువురి గురించి మాట్లాడ‌టం ఆస‌క్తిని క‌లిగించింది. చిత్ర పరిశ్రమలో సమంత ప్రయాణం ఎంతో గొప్ప‌గా సాగుతోంద‌ని శోభిత‌ మెచ్చుకున్నారు. సమంత ఆకట్టుకునే లైన‌ప్ తో కెరీర్ ని సాగిస్తోంద‌ని తాను ఏ ప్రాజెక్ట్ చేసినా హెడ్ లైన్స్ లోకి రాగ‌లిగే విధానం నిజంగా బాగుంద‌ని శోభిత ప్ర‌శంసించింది.

సామ్ ప్ర‌యాణం అద్భుతంగా ఉంద‌ని కొనియాడింది. నాగ చైతన్య గురించి మాట్లాడుతూ-''అతడి స్వభావం మంచిద‌''ని శోభిత కాంప్లిమెంట్ ఇచ్చింది. అతడు ఎంతో శాంత స్వ‌భావి. ప్రశాంతమైన వ్యక్తి.. చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తాడు. నేను నిజంగా అభినందిస్తున్నాను.. అని వ్యాఖ్యానించింది.

ప్ర‌స్తుతం శోభిత వ్యాఖ్య‌లు గూగుల్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే మీడియా అంతా ఎంతో హుందాగా క‌థ‌నాలు రాయ‌డంపై శోభిత క్రిప్టిక్ పోస్ట్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. శోభిత కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే గూఢ‌చారి త‌ర్వాత అడివి శేష్ తో క‌లిసి మేజ‌ర్ చిత్రంలో న‌టించింది. న‌టిగా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో మైమ‌రిపించింది.

శోభిత ల‌య‌న్స్ గోల్డ్ అవార్డ్ ను ద‌క్కించుకుంది. బాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిన‌ 'ది నైట్ మేనేజర్‌'లో ఆదిత్య రాయ్ కపూర్ - అనిల్ కపూర్ లతో కలిసి శోభిత కీల‌క పాత్ర‌లో న‌టించింది. రీమేక్ లో ఎలిజబెత్ డెబిక్కీ పాత్రను పోషించగా త‌న పాత్ర‌కు మంచి పేరొచ్చింది. శోభిత ధూళిపాల త‌దుప‌రి వ‌రుసగా వెబ్ సిరీస్ లు సినిమాల‌తో బిజీగా ఉందని తెలుస్తోంది.