Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: శివబాలాజీ ఈజ్ బ్యాక్!

By:  Tupaki Desk   |   11 Nov 2017 8:15 AM GMT
ట్రైలర్ టాక్: శివబాలాజీ ఈజ్ బ్యాక్!
X
‘బిగ్ బాస్’ షోతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపే సంపాదించాడు శివబాలాజీ. దశాబ్దం పైగా సినిమాల్లో కొనసాగడం వల్ల రాని పేరు ‘బిగ్ బాస్’తో అతడికి వచ్చిందంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఈ షో చేయడానికి ముందు శివబాలాజీ సినిమా కెరీర్ ఏమంత బాగా లేదు. ‘కాటమరాయుడు’ లాంటి సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్ర చేశాడతను. దాని కంటే ముందే అతను ఇలా క్యారెక్టర్ల స్థాయికి పడిపోయాడు. ఐతే కెరీర్ ఆరంభంలో శివబాలాజీ ‘ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ’ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతను కథానాయకుడిగా మరో సినిమా రాబోతోంది. అదే.. స్నేహమేరా జీవితం.

రాజీవ్ కనకాల మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శివబాలాజీనే నిర్మాత కూడా. మహేష్ ఉప్పుటూరి దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమా గత ఏడాదే మొదలైంది. కానీ ఈ సినిమా గురించి అప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ‘బిగ్ బాస్’తో పేరు సంపాదించాక మంచి టైమింగ్ చూసి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు శివబాలాజీ. దీని ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది. 80వ దశకం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగడం విశేషం. అప్పటి వాతావరణాన్ని సినిమాలో బాగానే చూపించినట్లున్నారు. ఇద్దరు ఆప్తమిత్రులు ఓ అమ్మాయి విషయంలో గొడవకు దిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉన్నట్లుంది. శివబాలాజీ రౌడీ క్యారెక్టర్ చేస్తుంటే.. పేరు, డబ్బు ఉన్న బడా బాబు పాత్రలో కనిపిస్తున్నాడు. ఇద్దరి గెటప్స్.. క్యారెక్టర్లు ఆసక్తికరంగానే కనిపిస్తున్నాయి. ట్రైలర్ వరకు ఆసక్తికరంగానే అనిపిస్తోంది. సినిమా కోసం శివబాలాజీ బాగానే ఖర్చు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. శివబాలాజీ ఈజ్ బ్యాక్ అనే ఫీలింగ్ కలిగిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.