Begin typing your search above and press return to search.
ఏఎన్నార్ - నాగార్జునతో నటించి తప్పు చేశా: సుమంత్
By: Tupaki Desk | 14 April 2020 1:00 PM ISTసుమంత్.. అక్కినేని నాగార్జునకు అల్లుడు. అయితే హీరోగా టాలీవుడ్ లో మొదట్లో బాగానే హిట్ అయ్యాడు. ఆ తరువాత వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో తెరమరుగయ్యాడు. ఇప్పుడు సినిమాలకే దూరంగా ఉంటున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమంత్ హాట్ కామెంట్ చేశాడు. తాను చినమామ నాగార్జునతో ‘స్నేహమంటే ఇదేరా’ సినిమా చేయడం పెద్ద తప్పు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2001లో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ కూడా అయ్యిందని.. తనకు ముందే ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని అనిపించిందన్నారు. కానీ మామయ్యతో అప్పటికే రెండు హిట్స్ కొట్టిన సూపర్ గుడ్ ఫిలింస్ వారు హ్యాట్రిక్ కొడతారనే నమ్మకంతోనే సినిమా చేశానని సుమంత్ అన్నారు.
‘స్నేహమంటే ఇదేరా’ సినిమా ఫ్లాప్ కావడానికి కారణాలను సుమంత్ వెల్లడించారు. అసలు మామ అల్లుల్లమైన నేను, నాగార్జునలను స్నేహితులంటే ప్రేక్షకులు అంగీకరించలేదని.. స్క్రిప్ట్ కూడా అంత గొప్పగా ఏమీ లేదని సుమంత్ తెలిపారు. మలయాళంతోపాటు తమిళంలో విజయ్, సూర్య చేస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని.. కానీ తెలుగులో మాత్రం తమ బంధాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదన్నారు. ఈ విషయం తనకు ముందే తెలుసునని.. కానీ బయటకు చెప్పలేదని సుమంత్ అన్నారు.
ఇక ‘స్నేహమంటే ఇదేరా’ సినిమాలో అల్లుడైన తాను మామ నాగార్జునను కొట్టే సీన్ తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని.. ఇలా మామను కొట్టడాన్ని కూడా ప్రేక్షకులు జీర్ణించుకోలేదని సుమంత్ తెలిపారు.
ఇక నాగార్జునతోనే కాదు.. తాతయ్య నాగేశ్వరరావుతోనూ ‘పెళ్లి సంబంధం’ సినిమా చేశానని.. రాఘవేంద్రరావు ఒత్తిడితో చేసిన ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యిందని సుమంత్ తెలిపారు. తాతయ్య, మామయ్యతో చే్యాలనే ఆరాటంతో చేసిన ఈ సినిమాలు స్క్రిప్ట్ సరిగా లేక - తమ బంధం కారణంగానే ఆడలేదని సుమంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.