Begin typing your search above and press return to search.
ఉల్లాల్ `ఎక్స్ పైరీ డేట్` అయిపోయినట్టేనా?
By: Tupaki Desk | 29 Sep 2020 10:10 AM GMTసల్మాన్ ఖాన్ `లక్కీ` సినిమాతో నాయికగా ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్ అచ్చు గుద్దినట్టు ఐశ్వర్యారాయ్ నే తలపించింది. అదే తనకు వరం .. అదే తనకు శాపం. అయితే జూనియర్ ఐష్ గా దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. కానీ ఆ క్రేజ్ ని మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. ప్రస్తుతం నటిగా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వుంది. సినిమాలేవీ లేకపోవడంతో డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తోంది. స్నేహి ఉల్లాల్ నటిస్తున్న వెబ్ సిరీస్ `ఎక్స్పైరీ డేట్`.
ఈ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా స్నేహా ఉల్లాల్ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. నటీనటులకు కొన్ని కష్టతరమైన సన్నివేశాలంటూ వుంటాయి. నా వరకైతే ఇంటిమేట్ సీన్స్ ని సరిగ్గా ప్రెజెంట్ చేయకపోతే ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఫీలవుతాను. అవి నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. దాని ప్రభావం అప్పుడప్పుడు నా నటనపై పడుతూ వుంటుంది. ఇలాంటి సీన్ లు చేయాల్సి నప్పుడు చాలా ఇబ్బంద కరంగా ఫీలవుతుంటాను అని స్నేహా ఉల్లాల్ వెల్లడించింది.
అయితే ఆమె నటిస్తున్న `ఎక్స్ పైరీ డేట్` మాత్రం వివాహేతర సంబంధాల నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో చాలా ఇంటిమేట్ సీన్స్ వున్నాయని అందులో కొన్ని స్నేహా ఉల్లాల్ పై వున్నాయని చెబుతున్నారు. అక్టోబర్ 2న జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ లోని ఇంటిమేట్ సీన్ లలో స్నేహా ఎలా నటించిందో చూడాలి మరి.