Begin typing your search above and press return to search.

కలెక్షన్లు ఎంతో చూడాలనే వెయిటింగ్‌

By:  Tupaki Desk   |   20 July 2015 9:24 PM IST
కలెక్షన్లు ఎంతో చూడాలనే వెయిటింగ్‌
X
జూనియర్‌ ఐశ్వర్యారాయ్‌ స్నేహా ఉల్లాల్‌.. ఎంత ప్రయత్నించినా స్టార్‌ హీరోయిన్‌ స్టాటస్‌ అందుకోలేకపోయింది. అటు హిందీ, ఇటు తెలుగు రెండుచోట్లా ఆశించిన అవకాశాలు దక్కించుకోలేకపోయింది. సినిమాల్లేక రెండుచోట్లా జనాలు మర్చిపోతున్నారు ఈ అమ్మడిని. అయితే తనని ఎవరూ మర్చిపోకూడదు అనుకుందో ఏమో.. అప్పుడప్పుడు కొన్ని తెలివైన కామెంట్ల తో లైమ్‌ లైట్‌ లోకొస్తోంది.

కెరీర్‌ ఆరంభించిందే సల్మాన్‌ ఖాన్‌ తో కాబట్టి అతడికి పెద్ద ఫ్యాన్‌ ని అని ప్రకటించుకుంది. ఆ తర్వాత హిందీ పరిశ్రమ నుంచి తెలుగు పరిశ్రమ లో పాపులర్‌ కావడానికి అది ఎంతో ఉపయోగపడింది. జూనియర్‌ ఐశ్వర్యారాయ్‌ అన్న గుర్తింపు కొంత వరకూ కలిసొచ్చింది. ఇటీవలే సల్మాన్‌ భజరంగి గురించి ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా అని ట్వీటింది. ఇప్పుడు సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. భజరంగి ఏ రేంజులో వసూలు చేస్తుందో అన్న ఆసక్తి నాలో ఉంది.. అని కామెంట్‌ చేసింది. సల్మాన్‌ అంతటి స్టార్‌ గురించి మాట్లాడింది కాబట్టి ఎలాగూ స్నేహ పేరును ప్రస్థావించాల్సి ఉంటుంది. అలా ప్రచారం కొట్టేస్తోందన్నమాట!