Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మరో బోల్డ్ క్రిస్మస్ విష్

By:  Tupaki Desk   |   26 Dec 2018 5:30 PM GMT
ఫోటో స్టొరీ: మరో బోల్డ్ క్రిస్మస్ విష్
X
బ్యూటీలందరూ ఈమధ్య పండగ శుభాకాంక్షలు చెప్పడంలో కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు. గతంలో పండగలకు ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని సంప్రదాయంగా శుభాకాంక్షలు చెప్పే వారు. ఇప్పుడు బికినీలలో హాటుగా ఘాటుగా సెక్సీగా శుభాకాంక్షలు చెప్తున్నారు. దిశా పతాని ఇన్నర్ వేర్లో పోజిచ్చి మరీ దిపావళి విషెస్ తెలిపింది. ఇక మిగతా బ్యూటీలు కూడా అలాగే దిశాను ఫాలో అయిపోతున్నారు.

ఇప్పటికే ఈషా గుప్తా.. పూనమ్ పాండే ఇప్పటికే హాటుగా నెటిజనులకు క్రిస్మస్ విషెస్ చెప్పారు. ఈ లిస్టులో స్నేహా ఉల్లాల్ కూడా జాయిన్ అయింది. తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసిన స్నేహ అందరికీ క్రిస్మస్ విషెస్ తెలిపింది. ఈ ఫోటోలో స్నేహ ఒక రెడ్ కలర్ ఫుల్ స్లీవ్స్ టీ-షర్ట్ వేసుకొని ఉంది. ఇక ప్యాంట్ వేసుకోకుండా పూల డిజైన్ ఉండే ప్యాంటీ తో సరిపెట్టింది. బ్యాక్ గ్రౌండ్ లో క్రిస్మస్ ట్రీ లైట్స్ లో మెరుస్తూ ఉంటే.. స్నేహ ఓ కుర్చీలో మోకాళ్ళపై కూర్చొని చేతిలో మంత్రదండం లాంటి బెలూన్ పట్టుకుంది. మంచి స్మైల్ తో పోజిచ్చిన ఈ బ్యూటీ కాస్త హాటుగానే ఉంది.

జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పేరు తెచ్చుకున్న స్నేహ తెలుగులో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' లాంటి హిట్ సినిమాలలో నటించింది గానీ ఎందుకో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరలేకపోయింది. ఈమధ్య సినిమా అవకాశాలు లేవు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో హీటు పెంచి ఫిలింమేకర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుంది.