Begin typing your search above and press return to search.

కొడుకు పేరు విహాన్‌ అని పెట్టారు

By:  Tupaki Desk   |   29 Aug 2015 10:11 AM IST
కొడుకు పేరు విహాన్‌ అని పెట్టారు
X
మన సెలబ్రిటీల పిల్లల పేర్లన్నీ పిచ్చ పాష్‌. ఆ పేరు సంస్కృతంలోదైనా లేక ఇంగ్లీష్‌ నేమ్‌ అయినా కూడా.. అది పోష్‌ గా ఉంటేనే పిల్లలకు పెడుతున్నారు. అయితే ఇది ట్రెండ్‌ అనలేం కాని, ఈ మధ్య కాలంలో పేరెంట్స్‌ అందరూ అలాగే ఉన్నారులే. సరిగ్గా ఇప్పుడు ఇదే రూటును ఫాలో అయ్యింది మాజీ హీరోయిన్ స్నేహ.

మ్యాటర్‌ ఏంటంటే.. పిల్లల పేర్ల ట్రెండ్‌ ఓ రేంజులో సాగుతున్న ఈరోజుల్లో గత ఆగస్టు 10న ఒక పండండి బాబుకు జన్మనిచ్చిన స్నేహ తన కొడుకుకు ఏమని పేరు పెడుతుందా అంని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఆ టైమ్‌ రావడంతో స్నేహ కూడా వెంటనే పేరెట్టేసింది. తమ కొడుకుకు విహాన్‌ అనే నామధేయం కన్ఫాం చేశారు స్నేహ-ప్రసన్న దంపతులు. మొత్తానికి తమ కొడుకు పేరును కూడా బాగా పోష్‌ గానే పెట్టరండోయ్‌.

అల్లు అర్జున్‌ కొడుకు పేరు అయాన్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌ తన పిల్లాడి పేరు అభయ్‌ రామ్‌ అని పెట్టాడు. జెనీలియా కొడుకు వివాన్‌. ఇప్పుడు స్నేహ కొడుకు పేరు విహాన్‌. వీళ్ళందరి పేర్లతో ఓ కొత్త పోష్ పిల్లల పేర్ల బుక్ ఒకటి అచ్చేయవచ్చు. అలా ఉందీ యవ్వారం.