Begin typing your search above and press return to search.

దొంగ‌చాటుగా అమ్మాయితో సినిమాకెళ్లి.. అడ్డంగా బుక్కైన‌ క్రికెట‌ర్‌ ర‌హానే!

By:  Tupaki Desk   |   16 April 2021 2:30 AM GMT
దొంగ‌చాటుగా అమ్మాయితో సినిమాకెళ్లి.. అడ్డంగా బుక్కైన‌ క్రికెట‌ర్‌ ర‌హానే!
X
టీమిండియా క్రికెట‌ర్ ర‌హానే.. ఫేస్ చూసిన వారు ఎవ‌రికైనా ఎలాంటి అభిప్రాయం క‌లుగుతుంది? మ‌నోడు రాముడు మంచి బాలుడు టైపు అని, నోట్లో జంతిక‌లు పెడితే కూడా కొర‌క‌లేడు అని అనేసుకుంటారు. కానీ.. ఇత‌గాడి ఫ్లాష్ బ్యాక్ వింటే మాత్రం.. పోటుగాడే అనేస్తారు!

ముంబైలోని ర‌హానే ఇంటిపక్క‌న ఓ ఫ్యామిలీ ఉండేది. ఆ ఇంట్లో రాధిక అనే అమ్మాయి ఉండేది. 'నువ్వే కావాలి' సినిమాలోని మాదిరిగా ఇద్ద‌రూ క‌లిసిమెలిసి తిరిగేవారు. అయితే.. ట్రాజెడీ లేకుండానే.. వీళ్లిద్ద‌రూ మ‌న‌సులు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇద్ద‌రూ క‌లిసే కాలేజీకి వెళ్లేవారు. పెద్ద‌వాళ్లు అది ఫ్రెండ్షిప్పే అనుకుంటూ వ‌చ్చారు. వీళ్లు మాత్రం దాన్ని ఎప్పుడో దాటేశామంటూ తెగ తిరిగేవాళ్లు.

కాలేజ్ బంక్ కొట్ట‌డాలు.. సినిమాలు, షికార్లు ఫుల్లుగా న‌డిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో.. ఇద్ద‌రూ క‌లిసి బైక్‌మీద జాలీగా సినిమాకెళ్లొస్తుండ‌గా.. రాధిక వాళ్ల మ‌మ్మీ కంట‌ప‌డ్డారు. ఇంకేముందీ? రెండు ఫ్యామిలీస్ మీటింగ్. 'ఏం జ‌రుగుతోందో మాకు తెలియాలి' అంటూ.. డీటీఎస్ లో రీసౌండ్ వచ్చేలా అడిగేశారు.

సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవంతో.. అసలు విషయం చెప్పేశారు. విచారించుకున్న పెద్ద‌లు.. రాముడు మంచి బాలుడే క‌దా అనుకొని ఇద్ద‌రికీ ముడేశారు. ఆ విధంగా.. ఇంటి ప‌క్కన‌ అమ్మాయిని.. త‌న ఇంట్లోకి తెచ్చుకున్నాడు ర‌హానే. అద‌న్న‌మాట మ‌నోడీ ల‌వ్ స్టోరీ. ఇదంతా ఎలా తెలుసు అంటారేమో.. మ‌నోడే పూస‌గుచ్చిన‌ట్టు ప్రేమ‌క‌థ‌ను ఆవిష్క‌రించాడు ఈ మ‌ధ్య‌.