Begin typing your search above and press return to search.

శాటిలైట్ లో తిప్పాడా మీసం?

By:  Tupaki Desk   |   24 Oct 2019 10:37 AM GMT
శాటిలైట్ లో తిప్పాడా మీసం?
X
చిన్న సినిమాల టైమ్ న‌డుస్తోంది. ఇటీవ‌లే ఏజెంట్ ఆత్రేయ‌.. బ్రోచేవారెవ‌రురా.. క్ష‌ణం వంటి చిత్రాలు స‌క్సెసవ్వ‌డంతో ఆ ఊపు శాటిలైట్ డిజిట‌ల్ రైట్స్ బిజినెస్ కి క‌లిసొస్తోంది. ఫ‌లానా హీరో సినిమా మినిమం గ్యారెంటీ అన్న న‌మ్మ‌కం కూడా డిజిట‌ల్ శాటిలైట్ కి ఊపు తెస్తోంది. ఈ కోవ‌లో చూస్తే న‌వ‌త‌రం హీరో శ్రీ‌విష్ణు సేఫ్ జోన్ హీరోగా పాపుల‌ర‌వుతున్నాడు. నారా రోహిత్ తో క‌లిసి సినిమాలు చేసిన శ్రీ‌విష్ణు ప్ర‌స్తుతం త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప‌నిలో ఉన్నాడు.

శ్రీవిష్ణు - నిక్కీ తంబోలి నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న తాజా చిత్రం 'తిప్ప‌రామీసం'. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌-కృష్ణ విజ‌య్ ఎల్ ప్రొడ‌క్ష‌న్‌- శ్రీ ఓం సినిమా ప‌తాకాల‌ పై కృష్ణ విజ‌య్‌.ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవ‌లే రిలీజైన మౌనం హృదయం రాగమే పాట‌కు చ‌క్క‌ని స్పందన వ‌చ్చింది. ఇదో చ‌క్క‌ని ప్రేమ‌క‌థ తో పాటు కొత్త‌ద‌నం ఉన్న సినిమా అన్న సంకేతం అందింది.

అందుకే ఈ సినిమా శాటిలైట్ కి క్రేజు నెల‌కొంది. తాజాగా ఈ చిత్రం శాటిలైట్ హక్కుల్ని ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ చానెల్ జెమినీ సొంతం చేసుకుంది. ఈ మేరకు జెమినీ సంస్థ సామాజిక మాధ్య‌మాల్లో అధికారికంగా పోస్టర్ ను రిలీజ్‌ చేసింది. శాటిలైట్ ధ‌ర ఏ రేంజులో ప‌లికింది? అన్న‌దానికి స‌రైన స‌మాచారం లేదు. శ్రీ‌విష్ణు సినిమాల‌కు శాటిలైట్ రేంజు కోటి లోపే. బ్రోచేవారెవ‌రురా చిత్రానికి 30-50ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌లికింది. ఇప్పుడు తిప్ప‌ర మీసం ఏ రేంజులో ఉంది? అన్న‌ది తెలియాల్సి ఉంది.