Begin typing your search above and press return to search.

రాణా ఇంటికి సండే స్పెషల్ గెస్ట్

By:  Tupaki Desk   |   7 March 2016 11:32 AM GMT
రాణా ఇంటికి సండే స్పెషల్ గెస్ట్
X
సండే నాడో - వీకెండ్ నాడో ఇంటికి స్పెషల్ గెస్టులు రావడం సహజం. అందిరికీ కాస్త వెసులుబాటు, కాసేపు కబుర్లాడుకునే తీరుబాటు ఉంటుంది కాబట్టి.. సాధారణంగా ఇలా వీకెండ్స్ సెలెక్ట్ చేసుకుని గెస్టులు వస్తుంటారని మనకు తెలుసు. ఇలాగే ఈ ఆదివారం నాడు భల్లాలదేవుడు రాణా ఇంటికి కూడా స్పెషల్ గెస్ట్ రాక సంభవించింది. తన ఇంటికి వచ్చిన స్పెషల్ గెస్ట్ గురించి రాణానే స్వయంగా చెప్పాడు.

అంతే కాదు.. వచ్చిన గెస్టును ఫోటో తీసి సోషల్ నెట్ వర్క్ లో కూడా పోస్ట్ చేశాడు. అదేంటీ.. ఇంటికి గెస్టొస్తే ఫోటో తీయడం దేనికి అనిపిస్తుంది కానీ.. రాణా ఇంటింకి వచ్చిన గెస్టు.. పెద్ద పాము. అవును పామే. దాదాపు ఐదు నుంచి ఆరగడుగులు ఉన్న పాటు రాణా ఇంటిలోకి వచ్చింది. మరి ఆ పామునేం చేశారో రాణా చెప్పలేదు కానీ.. 'ఈ ఆదివారం మధ్యాహ్నం.. మా ఇంటిలో నేను కలిసింది దీన్నే' అంటూ ఆ పాము ఫోటోను పోస్ట్ చేశాడు. దీన్ని ఫోటోలో చూసిన జనాలకే గుండెలు గుబగుబలాడాయి. ఇక డైరెక్టుగా చూసినవాళ్ల పరిస్థితి ఎలా ఉందో.

ఇదిలాఉంటే రాణా ఇప్పుడు చాలా వేగంగా సినిమాలు చేసేస్తున్నాడు. రీసెంట్ గా తమిళ మూవీ బెంగళూరు నాట్కాల్ ని పూర్తి చేసిన ఈ హీరో.. ఇప్పుడు ఘాజీని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఇది కూడా పూర్తి కాగానే.. బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు రాణా.