Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ ఖాతాలో అశ్లీల ఫోటోల దర్శనం.. 'షాక్'లో ప్రముఖ సింగర్!!

By:  Tupaki Desk   |   18 July 2020 11:30 AM GMT
ఫేస్ బుక్ ఖాతాలో అశ్లీల ఫోటోల దర్శనం.. షాక్లో ప్రముఖ సింగర్!!
X
"మసక మసక చీకటిలో.. మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో.." అంటూ తన పాటలతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపిన సింగర్ స్మిత. తన ప్రైవేట్ ఆల్బమ్స్, సినిమా పాటలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చురుకుగా పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా స్మితకి షాక్ ఇచ్చాడు ఓ హ్యాకర్. స్మిత ఆఫీసియల్ ఫేస్ బుక్‌ అకౌంట్ హ్యాక్ చేసి.. అందులో అశ్లిల ఫోటోలు పోస్ట్ చేశారట. స్మిత తన అకౌంట్లో అలాంటి పోస్టులు దర్శనమిచ్చే సరికి ఖంగుతిని వెంటనే అలెర్ట్ అయ్యిందట. స్మిత ఫేస్ బుక్ ఫాలోయర్స్ ఆ అసభ్యకరమైన పోస్టులు చూసి షాకయ్యారు.

అయితే తన ఫేస్ బుక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారంటూ ట్విట్టర్ ఫాలోయర్లకు ఇన్ఫర్మేషన్ అందించింది స్మిత. పాప్ సింగర్‌గా క్రేజ్ సంపాదించిన స్మిత తన ఈవెంట్స్‌కి సంబంధించిన విషయాలనే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ తన వాయిస్ వినిపిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల కరోనా నేపథ్యంలో ప్రజల్ని అలర్ట్ చేస్తూ వీడియో పెట్టింది స్మిత. అయితే స్మిత సింగర్ గానే కాకుండా పలు సినిమాలలో కూడా దర్శనమిచ్చింది. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన 'మల్లీశ్వరి' సినిమాలో కీలక పాత్ర పోషించింది. అంతేగాక స్పెషల్ వీడియో సాంగ్స్ తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

స్మిత బాహుబలి సినిమాలోని కిలికిలి భాషతో కూడా ఓ సాంగ్ క్రియేట్ చేసి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ గురించి స్పందిస్తూ.. ‘ఇదో భయంకరమైన రోజు. ఎవరో నా ఫేస్ బుక్‌ని హ్యాక్ చేసి స్టుపిడ్ కంటెంట్‌ పోస్ట్ చేశారు. వాటి వల్ల ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించాలని కోరింది స్మిత. తన ఫేస్ బుక్ తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి సహకరించి ఫేస్ బుక్ టీం అందరికీ ధన్యవాదాలు తెలిపింది. స్మిత ఐయామ్ బ్యాక్ అని అనగా.. వెల్కమ్ బ్యాక్ అంటూ నెటిజన్లు స్మితకు ఫేస్ బుక్‌లో స్వాగతం పలికారు.