Begin typing your search above and press return to search.

చిన్న సినిమా విధి, విధానాలివే!

By:  Tupaki Desk   |   18 Oct 2022 5:13 PM IST
చిన్న సినిమా విధి, విధానాలివే!
X
టాలీవుడ్ గ‌త కొంత కాలంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. కీల‌క స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం చిత్ర చిత్ర నిర్మాత‌ల మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుని స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అయ్యేంత వ‌ర‌కు సినిమా షూటింగ్ ల‌ని నె రోజుల పాటు నిర‌వ‌ధికంగా నిలిపివేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి, ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప‌లు కీల‌క అంశాల‌పై కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప‌లు ద‌ఫాలుగా వివిధ సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన నిర్మాత‌ల మండ‌లి, ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ తాజాగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

తాజాగా చిన్న సినిమాపై విధి విధానాల‌ని వెల్ల‌డించారు. రూ. 4 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించే సినిమాల‌ని చిన్న సినిమాలుగా ప‌రిగ‌ణించాల‌ని నిర్మాత‌ల మండ‌లి, ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ తాజాగా కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. దీనితో పాటు చిన్న సినిమాకు సంబంధించిన ప‌లు విధి విధానాల‌ని ప్ర‌క‌టించారు. తాజాగా నిర్మాత‌ల మండ‌లి, ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌క‌టించిన చిన్న సినిమా విధి, విధానాలివి.

1. రూ. 4 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించే సినిమాల‌ని చిన్న సినిమాలుగా ప‌రిగ‌ణించాలి.

2. సినిమా బ‌డ్జెట్ క‌మిటీకి తెలిపేందుకు ఛాంబ‌ర్ త‌యారు చేసిన ప్రొఫార్మాలో స‌ద‌రు సినిమాకు ప‌నిచేసే ముఖ్య‌మైన టెక్నిషియ‌న్ ల‌తో సంత‌కాలు చేయించి ఎన్ని రోజుల్లో సినిమాని పూర్తి చేస్తారో తెలపాలి. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, షూటింగ్ ఖ‌ర్చులు వెల్ల‌డించాలి. ఈ బ‌డ్జెట్ ని నిర్మాత‌తో పాటు డైరెక్ట‌ర్, మేనేజ‌ర్ కూర్చుని రెడీ చేసి ఇవ్వాల‌ట‌.

3. సినిమా షూటింగ్ ప్రారంభానికి 15 రోజుల ముందు ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

4. ధ‌ర‌ఖాస్తును ఫిలిం ఛాంబ‌ర్‌, ఫిలిం ఫెడ‌రేష‌న్ లో ఉన్న స‌బ్ క‌మిటీ ప‌రిశీలించి నిర్ధార‌ణ చేస్తుంది. దాన్ని ఫెడ‌రేష‌న్ ఆమోదించి 15 శాతం వేత‌న రాయితీ ఇస్తుంది.

5. చిన్న సినిమాగా ఆమోదించిన త‌రువాత ఫెడ‌రేష‌న్ వారు ఆ ప్రొడ్యూస‌ర్ కి 15 శాతం త‌గ్గించి వేత‌నాలు తీసుకోవాలి. దానిని ఫెడ‌రేష‌న్ బాధ్య‌త‌గా తీసుకుని 15 శాతం వేత‌నాలు అమ‌లు చేయాలి.

6. నిర్మాత ఫిలిం ఛాంబ‌ర్ కు ఇచ్చిన బ‌డ్జెట్ వివ‌రాలు ఎక్కువ కాకుండా వారిచ్చిన బ‌డ్జెట్ లోనే నిర్మాణం చేస్తామ‌ని స‌ద‌రు సినిమా నిర్మాత‌, డైరెక్ట‌ర్ ఒక అఫిడ‌విట్ ని ఫిలిం ఛాంబ‌ర్ కు ఇవ్వాలి. ఒక వేళ ఆ బ‌డ్జెట్ ఎక్కువైతే దానికి ద‌ర్శ‌కుడు బాధ్య‌త వ‌హించాలి.

7. కార్మికులు 15 శాతం రాయితీని అమ‌లు చేయ‌క‌పోతే దాని మీద ఎలాంటి చ‌ర్య తీసుకోవాలో చ‌ర్చించి త‌గిన నిర్ణ‌యం తీసుకోవాలి.

8. నెల‌లో 2, 4 మంగ‌ళ‌వారం నాడు క‌మిటీ ఛాంబ‌ర్ లో ఫెడ‌రేష‌న్ నుంచి ఇద్ద‌రు, ఛాంబ‌ర్ నుంచి ఇద్ద‌రు కూర్చొని చిన్న సినిమాల బ‌డ్జెట్ ని ప‌రిశీలించి ఆమోదం తెలిపి వారికి లెట‌ర్స్ ఇవ్వాల్సి వుంటుంది. అంటూ ప‌లు కీల‌క అంశాల‌ని చిన్న సినిమా విధి, విధానాలుగా మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.