Begin typing your search above and press return to search.

చిన్న సినిమా మేల్కోకుంటే క‌ష్ట‌మేనా?

By:  Tupaki Desk   |   15 Jun 2022 9:30 AM GMT
చిన్న సినిమా మేల్కోకుంటే క‌ష్ట‌మేనా?
X
క‌రోనా ఏ క్షణాన మొద‌లైందో కానీ ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ మార్పుల్ని తీసుకొచ్చింది. ప్ర‌తీ ఒక్క‌రిలోనూ విప్ల‌వాత్మ‌క మార్పులు మొద‌ల‌య్యాయి. కొత్త కొత్త అలవాట్లకు శ్రీ‌కారం చుట్టారు. పాత ఒక రోత కొత్తొక వింత‌లా మారింది. దీంతో అంతా కొత్త అల‌వాట్ల‌కు ఎడిక్ట్ అయిపోతున్నారు. క‌రోనా సినిమా ఇండ‌స్ట్రీలోనూ పెను మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టేలా చేసింది. అంతే కాకుండా ప్రేక్ష‌కుల మైండ్ సెట్ లోనూ మార్పులు వ‌చ్చాయి. సినిమాని చూసే ధోర‌ణిలోనూ మార్పులు మొద‌ల‌య్యాయి.

స‌గ‌టు సినీ అభిమాని గ‌తంలో థియేట‌ర్ల‌ల‌కు భారీ స్థాయిలో ఎగ‌బ‌డిన‌ట్టుగా రావ‌డం లేదు.. అందుకు ఇష్ట‌ప‌డ‌టం కూడా లేదు. టైమ్ పాస్ కోసం థియేర్ల‌కు వ‌చ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్ప‌డు ట్రెండ్ మారింది. అర‌చేతిలోకి ఫోన్ వ‌చ్చేశాక ఎంట‌ర్ టైన్ మెంట్ కోసం థియేట‌ర్ల‌కే వెళ్లాల‌ని ఎవ‌రూ అనుకోవ‌డం లేదు. అప్ప‌ట్లో ఏ సినిమా రిలీజ్ అయినా హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేకుండా థియేట‌ర్ల‌కు వ‌చ్చేవారు. కానీ ఇప్ప‌డు అలా జ‌ర‌గ‌డం లేదు.

హిట్, సూప‌ర్ హిట్ , బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే త‌ప్ప థియేట‌ర్ గేటు త‌లుపు త‌ట్టని ప‌రిస్థితి. క‌రోనా కార‌ణంగా ఓటీటీలు వెలుగులోకి రావ‌డంతో ద‌క్షిణాదిలో వీటికి థియేట‌ర్ల‌కు వ‌చ్చే ఆడియ‌న్స్ బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. దీంతో థియేట‌ర్ల‌కు రావ‌డానికి పెద్ద‌గా ఆస‌క్త‌ని చూపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో రోజు రోజుకీ థియేట‌ర్ల‌కు వ‌చ్చేవారి సంఖ్య ప్ర‌మాద‌క‌ర స్థాయిలో త‌గ్గుతూ వ‌స్తోంది. భారీగా పెంచిన టికెట్ రేట్లు కూడా ఇందుకు ఓ కార‌ణంగా నిలుస్తున్నాయి.

ఫ్యామిలీతో సినిమా చూడాలంటే ఓ సామాన్యుడు అక్ష‌రాలా రెండు వేలు ఖ‌ర్చుపెట్ట‌క త‌ప్ప‌డం లేదు. దీంతో ఫ్యామిలీస్ థియేట‌ర్ల‌కు రావ‌డానికి జంకుతూ క్ర‌మ క్ర‌మంగా దూర‌మ‌వుతున్నారు. దీంతో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు ల‌భించ‌క బావురు మంటున్న ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. పెద్ద సినిమాల‌కు ఈ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు కానీ చిన్న సినిమాలే భారీ స్థాయిలో న‌ష్ట‌పోతున్నాయి. రానున్న రోజుల్లో చిన్న సినిమా మ‌నుగ‌డ మ‌రింత ప్ర‌శ్నార్థ‌కంగా మారే ప్ర‌మాదం వుంద‌ని తెలుస్తోంది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం పెంచిన టికెట్ రేట్ల‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ‌లో 'ట్రిపుల్ ఆర్' ఈ తంతుకు బీజం ప‌డింది. ఈ సినిమాకు రూ. 400 టికెట్ రేట్ ని నిర్ణ‌యించారు. అయినా సినిమాపై వున్న క్రేజ్ తో చూశారు. ఆ త‌రువాత వ‌చ్చిన చిన్న సినిమా 150 నే అని ప్రాచారం చేసినా జ‌నం ప‌ట్టించుకోలేదు. టికెట్ రేట్ల కార‌ణంగా 'అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం' వంటి చిత్రాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. టికెట్ రేట్ల హైక్ విష‌యంలో పెద్ద సినిమాల‌కు న‌ష్టం లేదు కానీ చిన్న సినిమాలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఈ ప‌రిస్థితి నుంచి గ‌ట్టెక్కాలంటే రానున్న చిన్న సినిమాలు ఏదో ఒక మ్యాజిక్ చేయాల్సిందే. కిర‌ణ్ అబ్బ‌వ‌రం 'స‌మ్మ‌త‌మే' నుంచి స‌త్య‌దేవ్ 'గాడ్సే' వ‌ర‌కు చిన్న సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయడానికి రెడీ అవుతున్నాయి. టికెట్ ధ‌ర‌ల విష‌యంలో స‌గ‌టు ప్రేక్ష‌కుడికి భ‌రోసా ఇస్తేనే ఈ సినిమాల మ‌నుగ‌డ లేదంటే విప‌త్కర ప‌రిస్థితుల్ని ఎదుర్కోవ‌డం ఖాయం అని, చిన్న సినిమా మేల్కోకుంటే క‌ష్ట‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.