Begin typing your search above and press return to search.

ఈసారి 'జోహార్‌' తో అభిషేక్‌

By:  Tupaki Desk   |   29 Jan 2020 11:50 AM IST
ఈసారి జోహార్‌ తో అభిషేక్‌
X
ఈమద్య కాలంలో చిన్న పెద్ద సినిమాలను హోల్‌ సేల్‌ గా కొనుగోలు చేసి రిలీజ్‌ చేస్తున్న నిర్మాత అభిషేక్‌ నామ. అభిషేక్‌ పిక్చర్స్‌ లో ఈమద్య కాలంలో వచ్చిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అభిషేక్‌ పిక్చర్స్‌ లో డైరెక్ట్‌ సినిమాలు నిర్మించడం తో పాటు ఇతర నిర్మాతలు నిర్మించిన సినిమాలను విడుదల చేయడం చేస్తున్నాడు. మంచి సినిమాలు అందించాలనే ఉద్దేశ్యంతో అభిషేక్‌ నామా వరుసగా చిన్న చిత్రాలకు మంచి రిలీజ్‌ దక్కేలా చేస్తున్నాడు.

ఈసారి జోహార్‌ అనే చిత్రాన్ని విడుదల చేసేందుకు అభిషేక్‌ పిక్చర్స్‌ రెడీ అయ్యింది. తేజ మార్ని దర్శకత్వంలో భాను సందీప్‌ ఈ చిత్రాన్ని ధర్మ సూర్య పిక్చర్స్‌ లో నిర్మించాడు. ఈ చిత్రంలో దృశ్యం ఫేం ఎస్తర్‌ అనీల్‌ ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. ఈశ్వరి రావు మరియు సుభలేక సుధాకర్‌ లు కూడా ఇందులో నటించారు. మొత్తం అయిదు పాత్రల మద్య సాగే ఒక రాజకీయ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. కంటెంట్‌ నచ్చడంతో అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకు వచ్చారట. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్‌ రైట్స్‌ తో పాటు నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ ను కూడా అభిషేక్‌ పిక్చర్స్‌ దక్కించుకున్నట్లుగా స్వయంగా అభిషేక్‌ నామా ప్రకటించారు.

గత ఏడాది రాక్షసుడు.. ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాలతో పాటు పలు చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన అభిషేక్‌ పిక్చర్స్‌ విజయ్‌ దేవరకొండ వలర్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఆంధ్రా రైట్స్‌ ను దక్కించుకుందట. అలాగే ప్రెషర్‌ కుక్కర్‌ చిత్రాన్ని కూడా అభిషేక్‌ పిక్చర్స్‌ వారు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్‌ లో ప్రస్తుతం అభిషేక్‌ పిక్చర్స్‌ పేరు తెగ వినిపిస్తుంది.