Begin typing your search above and press return to search.

సాహో ఫ్యాన్స్ కు చిన్న అలెర్ట్

By:  Tupaki Desk   |   9 Aug 2019 11:08 AM GMT
సాహో ఫ్యాన్స్ కు చిన్న అలెర్ట్
X
డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ సినిమా ప్రేమికులందరూ ఎదురు చూస్తున్న సాహో ట్రైలర్ లాంచ్ రేపు జరగనుంది. అయితే ఇది హైదరాబాద్ లో ఉంటుందని భావించి ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్న వాళ్ళు లేకపోలేదు . వాళ్ళకోసం చిన్న సవరణ ఇచ్చింది యూనిట్. రేపు జరిగే ఈవెంట్ ఇక్కడ కాదు. ముంబైలో గ్రాండ్ గా సాయంత్రం 4 గంటలకు అన్ని బాషల ట్రైలర్లను రిలీజ్ చేసి మరుసటి రోజు అంటే 11న మన భాగ్యనగరంలో స్పెషల్ గా మీడియాతో పాటు లైవ్ ద్వారా అందరిని యూనిట్ మొత్తం మీట్ అవ్వబోతోంది.

నేషన్ వైడ్ రిలీజ్ కాబట్టి ముందుగా ముంబైలో ప్లాన్ చేశామని అదే రోజు తక్కువ గ్యాప్ లో అందరూ హైదరాబాద్ రావడం సాధ్యం కాదు కాబట్టి మరుసటి రోజు హైదరాబాద్ మీట్ ఉంటుందని చెప్పారు. సో సాహో ట్రైలర్ లాంచ్ ప్రత్యక్షంగా చూడాలంటే మాత్రం ముంబై వెళ్ళాల్సిందే. ఎలాగూ అందుబాటులో లైవ్ ఉంటుంది కాబట్టి అంత కష్టపడాల్సిన పని లేదు కాని ఎల్లుండి మీడియా మీట్ లో మాత్రం చాలా విశేషాలు తెలిసే అవకాశం ఉంది.

ఆగస్ట్ 30న విడుదల కానున్న సాహో మీద ఇప్పటికే అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ప్రీ బుకింగ్ పేరుతో ఇరవై రోజుల ముందే హంగామా స్టార్ట్ అయ్యింది. ట్రైలర్ వచ్చాక ఇప్పటిదాకా చూసింది నతింగ్ అనిపిస్తుందని ఆ రేంజ్ లో వీడియో కట్ చేశారని ఇన్ సైడ్ టాక్. ఇంతగా ఊరిస్తున్న సాహో ట్రైలర్ ని చూడాలంటే ఇంకో 24 గంటలు ఓపిగ్గా ఎదురు చూడాల్సిందే