Begin typing your search above and press return to search.

స్టైలిష్ లుక్కులో స్లిమ్ బ్యూటీ.. ఫామ్ లోకి వచ్చేదెప్పుడో..!

By:  Tupaki Desk   |   21 May 2021 3:30 AM GMT
స్టైలిష్ లుక్కులో స్లిమ్ బ్యూటీ.. ఫామ్ లోకి వచ్చేదెప్పుడో..!
X
సినీఇండస్ట్రీలో హీరోయిన్స్ లక్ గురించి నమ్ముతారో లేదో గాని వారి ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఫేవరేట్ హీరోయిన్ కు లక్ కలిసి రావట్లేదని వాపోతుంటారు. అలాంటి హీరోయిన్స్ లో ముంబైబ్యూటీ కూడా ఉంది. అందులోను కెరీర్ ప్రారంభించి పదిహేను సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంకా హీరోయిన్ స్టార్డం అందుకోలేక.. అటు పుష్కలంగా అవకాశాలు లేక సతమతమవుతోంది హీరోయిన్ వేదిక. ఈ భామ మహారాష్ట్రలోని సోలాపూర్ లో పుట్టింది. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులేసి పలు కమర్షియల్ యాడ్స్ చేసాక తమిళ సినిమాలో అవకాశం వస్తే ఓకే చెప్పి నటన వైపు మళ్ళింది. ఈ ముప్పై మూడేళ్ల సుందరి.. తమ పద్దెనిమిదవ యేటలోనే ఫస్ట్ సినిమా తమిళంలో మద్రాసి సినిమాతో డెబ్యూ చేసింది.

ఆ సినిమా వేదికకు మంచి నేమ్ తీసుకొచ్చింది. కానీ అమ్మడు వెంటనే హిందీలో ఆఫర్ రావడంతో ఆవైపు వెళ్ళింది. అక్కడ మొదటి సినిమానే(జై సంతోషి మా) దెబ్బకొట్టడంతో ఇంకా లాభం లేదని సౌత్ లోనే దృష్టిపెట్టింది. అలా ముని సినిమాతో కెరీర్ ప్రారంభించిన వేదిక.. కెరీర్ పరంగా హిట్స్ తక్కువే అందుకుందని చెప్పాలి. ఎందుకంటే ఓ హిట్ పడింది అనుకునే లోపల వరుసగా ఫ్లాప్స్ ఎదురవడం అమ్మడికి మాములే అయిపోయింది. అందుకే ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరలేకపోయింది. 2007లో విజయదశమి అనే సినిమాతో తెలుగు డెబ్యూ చేసింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యేసరికి కథ మళ్లీ మొదటికే వచ్చింది. అనంతరం బాణం - దగ్గరగా దూరంగా సినిమాలతో పలకరించింది. కానీ వేదికకు ఫస్ట్ బ్రేక్ మాత్రం డైరెక్టర్ బాలా తెరకెక్కించిన పరదేశీ సినిమా ఇచ్చింది.

అప్పటినుండి చాలా సినిమాలు చేస్తూనే వస్తుంది. కానీ ఇంతవరకు సరైన హిట్టు పడలేదు. కానీ చివరిగా బాలకృష్ణ సరసన రూలర్ అనే సినిమాలో కనిపించింది. కానీ ఆ సినిమా కూడా బ్రేక్ ఇవ్వలేదు. చేసేదేం లేక వచ్చిన సినిమాలే చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి. అందులో రెండు తమిళం (వినోదం) - ఒకటి మలయాళం (చేతి మందారం తులసి) - ఒకటి తెలుగు (జంగ్లీ) - కన్నడలో హోమ్ మినిస్టర్ సినిమాలు లైన్ లో పెట్టింది. ఇదిలా ఉండగా.. వేదిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్. అందుకే అమ్మడు ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. తాజాగా వేదిక స్టైలిష్ మినీ డ్రెస్ లో పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో వేదిక టాప్ టు బాటమ్ అందంగా పోజిచ్చింది. కానీ ఇదివరకటిలా కాకుండా అమ్మడు చాలా స్లిమ్ గా మారింది. ప్రస్తుతం వేదిక పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.