Begin typing your search above and press return to search.

రజినీని ఆదరించాం.. మహేష్ ను వదిలేస్తామా?

By:  Tupaki Desk   |   10 Sept 2017 9:42 AM
రజినీని ఆదరించాం.. మహేష్ ను వదిలేస్తామా?
X
దర్శకుడిగా మహేష్ బాబుతో ‘నాని’ సినిమా తీసిన ఎస్.జె.సూర్య ఇప్పుడు అదే హీరోకు విలన్ గా కనిపించబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘స్పైడర్’ సినిమాలో ఈ చిత్రం చూడబోతున్నాం. మహేష్ తో చాన్నాళ్ల పాటు ట్రావెల్ అయిన సూర్య.. అతను తొలిసారి తమిళ సినిమా చేసిన నేపథ్యంలో తనను ఎండోర్స్ చేయడానికి గట్టి ప్రయత్నమే చేశాడు. ‘స్పైడర్’ ఆడియో వేడుకలో సూర్య మాట్లాడుతూ.. మహేష్ బాబును తమిళ ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారని హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా మహేష్ బాబుకు సూపర్ స్టార్ రజినీతో సూర్య పోలిక పెట్టడం విశేషం.

రజినీకాంత్ తమిళుడు కాదని.. కానీ మా తమిళులు ఆయన్ని అక్కున చేర్చుకుని సూపర్ స్టార్ ను చేయలేదా.. అలాగే ఈ సూపర్ స్టార్ ను కూడా మావాళ్లు ఆదరిస్తారు అని సూర్య అనడం విశేషం. ఒక స్టార్ ఎంత అణకువతో ఉన్నాడు.. ఎంత మంచివాడు అన్నదాన్ని బట్టే అతడి స్టార్ డమ్ కు విలువ వస్తుందని.. ఆ విషయంలో మహేష్ బాబుకు తిరుగులేదని.. అందుకే అతను సూపర్ స్టార్ అయ్యాడని సూర్య కితాబిచ్చాడు. అతడికి గొప్ప మనసుందని.. ఎంతో కమిట్మెంట్.. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అతనని అన్నాడు. మహేష్ చెన్నై పిల్లవాడని.. అతణ్ని తమిళ ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని సూర్య ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘స్పైడర్’ బలమైన కంటెంట్ ఉన్న సినిమా అని.. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ మహేష్ బాబును ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ లాగా చూపించాడని.. మురుగదాస్ తో పని చేయడానికి ఇండియాలో చాలామంది పెద్ద స్టార్లు కూడా చాలా ఆసక్తి చూపిస్తారని.. అలాంటిది తనను ఈ సినిమాలో నటించమనేసరికి మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నానని అన్నాడు సూర్య. రజినీకాంత్ కు ‘చంద్రముఖి’ ఎలాగో.. మహేష్ బాబుకు ‘స్పైడర్’ అలా అవుతుందని అతను అభిప్రాయపడ్డాడు.