Begin typing your search above and press return to search.
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ 'ఖుషీ ' కాంబినేషన్లో సినిమా!
By: Tupaki Desk | 19 Nov 2020 6:00 PM ISTఇళయ దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాట అగ్రకథానాయకుడిగా కొనసాగుతున్నారు. మాస్‌హీరోగా ఆయన కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. విజయ్ తో సినిమా చేసేందుకు దర్శకులు క్యూ కడుతుంటారు. ఆయన మాత్రం నచ్చిన కథ, పాత్ర దొరికితేనే చేస్తారు. విజయ్‌కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే ఆయన ఎక్కువగా ఆ జోనర్‌లోనే సినిమాలు చేస్తుంటారు.
ఆయన తాజాగా నటించిన ‘ మాస్టర్’ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల కానున్నది. దీని తర్వాత చిత్రం ( 65వ చిత్రం) ఎవరు దర్శకత్వం వహిస్తారని ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తారని తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే పారితోషికం విషయమై సమస్యలు తలెత్తడంతో ఆయన మానుకున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ప్రముఖ దర్శకులు పేరరసు, మగిళ తిరుమేని, నెల్సన్ మోహన్‌రాజా, హరి పోటీపడుతున్నారు. వీరిలో పేరరసుకు చాన్స్ లభిస్తుందని టాక్. ఇప్పటికే విజయ్ చాలా కథలు విన్నప్పటికీ ఏదీ ఫైనల్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రముఖ దర్శకుడు ఖుషీ ఫేమ్ ఎస్జే సూర్య విజయ్‌తో సమావేశమై ఓ కథను వినిపించారు. లవ్, సెంటిమెంట్, యాక్షన్ అంశాలు కలిగిన ఆ కథ విజయ్‌కు బాగా నచ్చినట్టు టాక్. విజయ్ ఇదివరకే ఎస్జే సూర్య దర్శకత్వంలో ‘ఖుషీ’ చిత్రంలో నటించారు. అది బాక్సాఫిస్ వద్ద భారీహిట్ కొట్టింది.
ఆ సినిమా అదే పేరుతో తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ చేయగా పవన్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పవన్ స్టార్డం ను రెట్టింపు చేసింది. కాగా విజయ్, సూర్య కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తే హిట్ కొట్టడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ సినిమాకు విజయ్ ఇంకా ఓకే చెప్పలేదు. త్వరలోనే విజయ్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.