Begin typing your search above and press return to search.

షారూక్ ఎంతగా పడిపోయాడంటే..

By:  Tupaki Desk   |   15 Jun 2018 4:08 AM GMT
షారూక్ ఎంతగా పడిపోయాడంటే..
X
షారూక్ ఖాన్ అంటే.. ఒకప్పుడు బాలీవుడ్ కి కింగ్ ఖాన్. బాక్సాఫీస్ కి బాద్షా. వసూళ్ల వర్షం కురిపించగలిగే సత్తా ఉన్న అసలు సిసలైన స్టార్ హీరో. ఇప్పుడు ఆమిర్ ఖాన్.. సల్మాన్ ఖాన్ టాప్ గేర్ లో ఉన్నారు కానీ.. వీరికంటే ఎక్కువ ఫాలోయింగ్ నే ఎంజాయ్ చేశాడు. కానీ మెల్లగా ఆ ఫేమ్ తగ్గిపోయింది. ఖాన్ త్రయంలో ఇతర హీరోలు టాప్ లోకి వెళితే.. ఈయన రేంజ్ తగ్గిపోయింది.

సినిమాలు ఆడడం మానేశాయి. హిట్ అనిపించుకున్న సినిమాలకు కూడా డబ్బులు రావడం మానేశాయి. చెన్నై ఎక్స్ ప్రెస్ మినహాయిస్తే.. కనీస మాత్రంగా ఆడిన చిత్రాలు కూడా లేవు. వంద కోట్ల వసూళ్లను రాబట్టడం షారూక్ లాంటి హీరోకు గగనం అయిపోయిందంటే.. పరిస్థితి అర్ధం అవుతుంది. ఇప్పుడు జీరో అంటూ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో జీరో అంటూ కొత్త సినిమా చేస్తున్నాడు షారూక్. ఈద్ సందర్భంగా.. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో కనిపించిన టీజర్ ను కూడా విడుదల చేశారు.

సల్మాన్-షారూక్ కలిసి ఓ సినిమాలో నటించడం.. స్టెప్పులేయడం అంటే అందరికీ నచ్చుతుంది. అందుకే మీడియా సూపర్బ్ అంటూ ఈ టీజర్ పై ప్రశంసలు కురిపించేసింది. టీజర్ కు ఇచ్చిన రివ్యూలను ఓ చోటకు చేర్చి.. దాన్ని కూడా ఓ పోస్టర్ గా మలిచి వేశారంటే.. షారూక్ ప్రస్తుతం హిట్టు కోసం ఎంతగా పరితపిస్తున్నాడో అర్ధం అవుతుంది. అయితే.. ఫ్యాన్స్ మాత్రం ఒక్క సినిమా సరైనది పడితే మాత్రం.. తమ హీరో టాప్ గేర్ లోకి వచ్చేస్తాడని నమ్మకంగా ఉన్నారు.