Begin typing your search above and press return to search.

సైజ్ లో అంత తేడా ఎందుకొచ్చిందో?

By:  Tupaki Desk   |   25 Nov 2015 4:23 AM GMT
సైజ్ లో అంత తేడా ఎందుకొచ్చిందో?
X
సెన్సార్ సంగతులు ఇన్నిన్ని కాదయా అన్నట్లుగా ఉంటుంది బోర్డ్ వాలకం. ఓ టీం సినిమాని చూసి విపరీతమైన కట్స్ చెప్తే.. మళ్లీ స్క్రీనింగ్ పంపినపుడు ఒకటి రెండు కత్తెరలతో పర్మిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు సైజ్ జీరో సర్టిఫికేట్ వ్యవహారం కూడా అంతే అనుకున్నారు. కానీ అంతలోనే అసలు విషయం వేరే ఉందనే సంగతి బయటపడింది.

అనుష్క సైజ్ జీరోకి.. తెలుగులో యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇదే సినిమా తమిళ వెర్షన్ కి మాత్రం క్లీన్ యూ సర్టిఫికేట్ రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది కూడా సెన్సార్ బోర్డ్ సిత్రాల్లో భాగమే అనుకున్నారు. అయితే.. అసలు విషయం వేరే ఉంది. తెలుగు వెర్షన్ కి, తమిళ వెర్షన్ కి స్క్రీనింగ్ కి పంపిన ఫైనల్ కాపీలో తేడా ఉందట. అందుకే ఈ చిత్రానికి తమిళ్ లో యూ సర్టిఫికేట్ వచ్చిందని తెలిసింది.

నిజానికి ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా తెరకెక్కించడంతోనే రెండుసార్లు స్క్రీనింగ్ చేయించాల్సిన అవసరం వచ్చింది. అదే కేవలం డబ్బింగ్ అయితే, ఒకే టైటిల్ కాబట్టి తమిళ సెన్సార్ అవసరం ఉండేది కాదు. కానీ దీన్ని డబ్బింగ్ మూవీగా తమిళ్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ పీవీపీ అంగీకరించలేదు. అందుకే నిర్మాణం నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో రెండు సర్టిఫికేట్లు అవసరమయ్యాయి. ఇప్పుడు రెండు వెర్షన్లకు రెండు రకాల సర్టిఫికేట్స్ రావడం ఆశ్చర్యకరమైన విషయమే. అయితే.. తెలుగు వెర్షన్ లో ఉన్నదేంటి.. తమిళ్ లో లేనిదేంటి.. అక్కడ యూ ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు మొదలయ్యాయిప్పుడు.