Begin typing your search above and press return to search.

శివాని చెక్ పెట్టేలా ఉందే

By:  Tupaki Desk   |   29 March 2018 5:44 PM GMT
శివాని చెక్ పెట్టేలా ఉందే
X
మొదట సినిమా ఇండస్టీలో అడుగుపెట్టే ముద్దుగుమ్మలు చాలా వరకు గ్లామర్ పాత్రలో కనిపించడానికి అప్పుడే ఒప్పుకోరు అనే ఓ టాక్ ఉంది. కానీ ఈ తరం బ్యూటీలు మాత్రం చాలా స్పీడ్ అయిపోతున్నారు. లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు ఎక్కువగా గ్లామర్ రోల్స్ తోనే అలరిస్తున్నారు. కొందరైతే ఏకంగా మొదట్లోనే బికినిలో కూడా దర్శనం ఇస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి అమ్మాయిలు కూడా వారసత్వాన్ని అందుకుంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి కొణిదెల నిహారిక తనదైన శైలిలో హీరోయిన్ గా అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక అదే తరహాలో మరో స్టార్ హీరో కూతురు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ తన మొదటి సినిమాను ఇటీవల స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అడవిశేష్ ఆ సినిమాలో కథానాయకుడిగా కనిపించనున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ లాంచ్ అయిన రోజు శివని కాస్త బొద్దుగా కనిపించిందని ఓ టాక్ వైరల్ అయ్యింది.

అయితే నెల గడవకముందే శివని ఆ రూమర్స్ కి చెక్ పెట్టేసింది. తను పర్సనల్ గా దిగిన కొన్ని పోటోలను రిలీజ్ చేసి విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది. ట్రెడిషనల్ గా కనిపిస్తూనే గ్లామర్ ని కూడా గట్టిగా యాడ్ చేయడంతో అమ్మడు బొద్దుగా ఉన్నా చాలా అందంగా ఉందని నెటీజన్స్ నుంచి కామెంట్స్ అందుతున్నాయి. మొన్నటి వరకు ఈ రేంజ్ లో శివాని కనిపించలేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే శివని త్వరలోనే టాప్ హీరోయిన్స్ కి చెక్ పెట్టేస్తుందని కూడా చెబుతున్నారు. చూడాలి మరి గ్లామర్ వరల్డ్ లో ఈ తెలుగమ్మాయి ఎంతవరకు సక్సెస్ అవుతుందో..