Begin typing your search above and press return to search.

రెమో.. ఆ మూవీని కాపి కొట్టేశాడా...

By:  Tupaki Desk   |   22 Sep 2016 3:16 PM GMT
రెమో.. ఆ మూవీని కాపి కొట్టేశాడా...
X
శివకార్తికేయన్ - కీర్తి సురేష్ జంటగా నటించిన రెమో.. ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో హీరో శివకార్తికేయన్.. పూర్తి స్థాయిలో లేడీ గెటప్ లో కనిపించనున్నాడు.

రజినీకాంత్ అంత యాక్టర్ అయిపోవాలని కలలు కనే కేరక్టర్ హీరోది. అయితే.. అతని తల్లి కూడా నువ్వు యాక్టర్ కాలేవంటుంది. ఓ దర్శకుడు(కేఎస్ రవికుమార్)ని కలిస్తే.. మా సినిమాలో హీరోది లేడీ నర్స్ వేషం.. నువ్వు చేయలేవు అంటాడు. దీన్నో ఛాలెంజ్ గా తీసుకుని.. నిజంగానే లేడీ గెటప్ లో ఓ హాస్పిటల్ లో నర్స్ గా చేరితే.. అక్కడ ఇతని లవర్ కీర్తి సురేష్ కూడా ఉంటుంది. మొదట ఆమెకి ఈ సంగతి తెలీకపోయినా.. తర్వాత అసలు సంగతి తెలిసి సీరియస్ అవుతుంది. ఇక తన డ్రీమ్ ఎలా నెరవేర్చుకున్నాడన్నదే రెమో స్టోరీ.

ఈ కథను 1982లో వచ్చిన హాలీవుడ్ మూవీ టూట్సీ నుంచి ఇన్ స్పైర్ అయి రాసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అందులో హీరో కూడా యాక్టర్ అవాలని కోరుకుంటాడు కానీ.. అవకాశాలు రావు. దీంతో లేడీ గెటప్ లో కొత్త ఐడెంటిటీ సంపాదించి.. పెద్ద స్టార్ అయిపోతాడు హీరో డస్టిన్ హాఫ్ మ్యాన్. దాదాపుగా ఇదే స్టోరీని ఇండియన్ వెర్షన్ రాసుకున్నారనే విషయం కనిపిస్తోంది.