Begin typing your search above and press return to search.

న‌రేష్ అబద్ధాల వ‌ల్ల MAAకి న‌ష్టం? శివాజీరాజా ఆరోప‌ణ‌!!

By:  Tupaki Desk   |   8 Oct 2021 2:41 PM GMT
న‌రేష్ అబద్ధాల వ‌ల్ల MAAకి న‌ష్టం? శివాజీరాజా ఆరోప‌ణ‌!!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో గొడ‌వ‌లు ముదిరిపాకాన ప‌డ‌డానికి సీనియ‌ర్ న‌రేష్ అధ్య‌క్షుడ‌వ్వ‌డం వ‌ల్ల‌నేన‌ని మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా తాజా ఇంట‌ర్వ్యూలో ఆరోపించారు. అత‌డు ప్ర‌తిదీ అబ‌ద్ధ‌మాడార‌ని.. రాజ‌కీయాలు చేసార‌ని ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది.

అక్టోబ‌ర్ 10న `మా` ఎన్నిక‌లు జ‌ర‌గనున్న వేళ అత‌డు ప‌లు సంచ‌ల‌న విష‌యాల్ని వెల్ల‌డించారు. నిజానికి మా అసోసియేష‌న్ కోసం నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డితే మాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని నిధి దుర్వినియోగం అంటూ న‌రేష్ అబ‌ద్ధాల్ని ప్ర‌చారం చేశార‌ని శివాజీ రాజా అన్నారు. అంతేకాదు .. నిధి దుర్వినియోగం జ‌ర‌గ‌లేద‌ని సినీపెద్ద చిరంజీవి గారు విచార‌ణ‌లో నిగ్గు తేల్చార‌ని కానీ న‌రేష్ త‌మ‌కు ఇప్ప‌టికీ సారీ చెప్ప‌లేద‌ని అన్నారు.

అంతేకాదు మా ఆర్టిస్టుల కోసం వృద్ధాశ్ర‌మం నిర్మించాల‌ని అనుకున్నాన‌ని కూడా శివాజీ రాజా అన్నారు. దానికోసం ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాలు చేయాల‌ని అనుకున్నాం. అమెరికాలో వేరే ప్రోగ్రామ్ ని ప్లాన్ చేశాం. దానికి మ‌హేష్ ని క‌లిసి ఆహ్వానిస్తే.. త‌న‌కు ఓకే కానీ న‌మ్ర‌త‌ను అడ‌గాల‌ని అన్నార‌ని శివాజీ రాజా తెలిపారు. న‌మ్ర‌త‌ను తాము క‌లిసి ఒప్పించామ‌ని... అయితే ప్ర‌భాస్ ని క‌లిస్తే బిజీ షెడ్యూల్స్ వ‌ల్ల తాను రాగ‌ల‌నో లేదో తెలీద‌ని అన్నార‌ని అయితే దానిబ‌దులు త‌న‌వంతుగా 2కోట్లు నిధిని ఇస్తాన‌ని అన్నార‌ని దాంతో తామంతా ఎంతో సంతృప్తి ప‌డ్డామ‌ని శివాజీ రాజా తెలిపారు. ఓవ‌రాల్ గా మ‌హేష్ ఈవెంట్ స‌హా ప్ర‌భాస్ డొనేష‌న్ తో క‌లిసి కోట్లు న‌ష్ట‌పోవాల్సొచ్చింద‌ని శివాజీ రాజా వ్యాఖ్య‌లు వెల్ల‌డిస్తున్నాయి. నిజానికి ర‌క‌ర‌కాల త‌ప్పుడు ఆరోప‌ణ‌ల వ‌ల్ల‌నే మాకు న‌ష్టం వ‌చ్చింద‌నే కోణంలో శివాజీ రాజా ఇంట‌ర్వ్యూలో ముచ్చ‌టించ‌డం విశేషం. న‌రేష్ అన్నీ అబ‌ద్ధాలు ఆడేవార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. నాగబాబు మద్దతు ప్రకటించి ఉండకపోయి ఉంటే నరేష్‌ విజయం సాధించేవాడు కాదని అన్నారు. నరేష్‌ కు నాగబాబు ఎందుకు మద్దతు ఇచ్చారో ఇప్పటికీ తనకి తెలియదని పేర్కొన్నారు. ఇక నరేష్‌ ఆడే పాచికల ఆటలో ప్రాణమిత్రులు కూడా విడిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయని శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న‌రేష్ చిన్న‌పిల్లాడు.. అత‌డి నోటి వెంట నిజం వ‌స్తే ఆశ్చ‌ర్య‌పోతాన‌ని అన్నారు.

2021-23 సీజ‌న్ కి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. 2019-21 వ‌ర‌కూ న‌రేష్ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. అంత‌కుముందు రెండేళ్లు శివాజీ రాజా అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. ఆ క్ర‌మంలోనే గొడ‌వ‌ల గురించి తెలిసిన‌దే. శివాజీ రాజా వ‌ర్సెస్ న‌రేష్ వివాదాలు మా అసోసియేష‌న్ ని ర‌చ్చ‌కీడ్చాయి. స్నేహితుల మ‌ధ్య వైరం మొద‌లైంద‌ని శివాజీ రాజా తాజా ఇంట‌ర్వ్యూలో తెలిపారు.