Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో ఓ 'మేడమ్' వచ్చేశాడు

By:  Tupaki Desk   |   23 Jun 2016 7:30 PM GMT
కోలీవుడ్ లో ఓ మేడమ్ వచ్చేశాడు
X
హీరో ఆడవేషం వేయడం చాలానే సినిమాల్లో చూసినా.. గుర్తుండి పోయేవి మాత్రం చాలా తక్కువ. చిత్రం భళారే విచిత్రం అంటూ పాతికేళ్ల క్రితం నరేష్ చేసిన హంగామా.. ఆ తర్వాత రెండేళ్లకే 'మేడమ్' అంటూ రాజేంద్రప్రసాద్ మెప్పించిన తీరు సూపర్బ్. హీరో ఆడవేషం వేసి మెప్పించడం ఆ తర్వాత ఈ రేంజ్ లో ఎవరూ ప్రయత్నించే ధైర్యం చేయలేదు.

కానీ ఇప్పుడో తమిళ హీరో నేనూ మేడమ్ నే అంటున్నాడు. యంగ్ హీరో శివకార్తికేయన్.. తన నెక్ట్స్ మూవీలో లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. ఇన్నాళ్లూ ఇవి రూమర్లే అయినా.. ఇప్పుడు 'రెమో' ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో క్లారిటీ వచ్చేసింది. ఓ నర్స్ గెటప్ వేసుకున్న శివకార్తికేయన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ముందే ఎలర్ట్ చేస్తే తప్ప.. నిజంగా అబ్బాయికే అమ్మాయి వేషం వేశారంటే నమ్మడం కష్టం.

ఆ రేంజ్ లో మేకప్ తో మాయ చేసేశాడు రెమో డైరెక్టర్. ఎప్పుడూ గెడ్డం, మీసం లుక్ తో మాస్ రచ్చ లేపే శివకార్తికేయన్ ని.. ఈ రేంజ్ లో చూసి కోలీవుడ్ లో అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. స్టోరీ కాన్సెప్ట్ లాంటివేమీ ఇంకా లీక్ కాలేదు కానీ.. సినిమాలో చాలాసేపు ఈ లేడీ గెటప్ లోనే ఉంటాడట హీరో. మొత్తానికి మరో మేడమ్ హీరోని చూసే అవకాశం చాలా ఏళ్లకు ఆడియన్స్ కి వస్తోంది. ఇప్పుడు హైప్ ప్రకారం డబ్బింగ్ చేస్తే తెలుగోళ్లకు కూడా ఈ ఛాన్స్ వచ్చినట్లే.