Begin typing your search above and press return to search.

కింగ్ ది డూ ఆర్ డై ప‌రిస్థితేనా?

By:  Tupaki Desk   |   4 May 2022 11:30 AM GMT
కింగ్ ది డూ ఆర్ డై ప‌రిస్థితేనా?
X
సీనియ‌ర్ హీరోల్లో చాలా మంది ప‌రిస్థితి డూ ఆర్ డై గానే వుంది. ప్ర‌స్తుతం వున్న పోటీలో వారు తాము కూడా ట్రాక్ లో వున్నామ‌ని చెప్పాలంటే ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ తో ముందుకు రావాల్సిందే. గ‌త కొంత కాలంగా ట్రాక్ త‌ప్పిన సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో `అఖండ‌` తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్ లో యాక్ష‌న్ డ్రామాని చేస్తున్నారు. త్వ‌ర‌లో అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో మ‌రో సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు.

ఇక విక్ట‌రీ వెంక‌టేష్ `ఎఫ్ 2` నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్ ల‌ని త‌న ఖాతాలో వేసుకుంటున్నారు. గ‌త ఏడాది నార‌ప్ప‌, దృశ్యం 2 చిత్రాల‌తో వ‌రుస‌గా విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు. ఇప్ప‌డు కింగ్ నాగార్జున వంతు. గ‌త కొంత కాలంగా కింగ్ నాగార్జున సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకోలేక‌పోతున్నారు. అప్పుడెప్పుడో `సోగ్గాడే చిన్ని నాయ‌న‌` చిత్రంతో 50 కోట్ల క్ల‌బ్ లో చేరిన నాగార్జున ఇంత వ‌ర‌కు మ‌ళ్లీ ఆ రేంజ్ హిట్‌ని సొంతం చేసుకోలేక పోయారు.

ఇప్ప‌డు కింగ్ నాగ్ కు ఆరేంజి హిట్ కాక‌పోయినా సూప‌ర్ హిట్ మాత్రం ఖ‌చ్చితంగా కావాల్సి్దే. అది ప‌డితేనే త‌ను మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన‌ట్టు అవుతుంది అంటున్నారు. ఇటీవ‌ల త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి చేసిన `బంగార్రాజు` ఆ స్థాయి స‌క్సెస్ ని సొంతం చేసుకోలేక‌పోయింది.

కంటెంట్ బ‌లంగా లేక‌పోవ‌డం.. సినిమా అంతూ చై తో పాటు కృతిశెట్టిపైనే సాగ‌డంతో అనుకున్న రేంజ్ కి వెళ్ల‌లేక‌పోయింది. నాగ్‌, చై ల‌తో మెస్మ‌రైజ్ చేస్తాడ‌నుకుంటే క‌ల్యాణ్ కృష్ణ పెద్ద‌గా అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. దీంతో ఆశించిన ఫ‌లితం ద‌క్కలేదు.

సూప‌ర్ కాప్ స్టోరీగా చేసిన `వైల్డ్ డాగ్` కూడా నాగ్ కు పెద్ద‌గా క‌లిసి రాలేదు. కంటెంట్ ప‌రంగా ఓకే అనిపించినా బాక్పాఫీస్ వ‌ద్ద మాత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. సీరియ‌స్ కంటెంట్ తో చేసిన సినిమా కావ‌డంతో నాగ్ కు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేక‌పోయింది. ఎంతో ఇష్ట‌ప‌డి చేసిన `మ‌న్మ‌థుడు 2` కూడా షాకిచ్చింది. ర‌కుల్ తో రొమాన్స్ చేసినా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో ఈసారి గ‌ట్టిగా కొత్త‌టాని ఫిక్స్ అయ్యాడ‌ట కింగ్. డూ ఆర్ డై గా మార‌డంతో ఎలాగైనా సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకోవాల‌నుకుంటున్నార‌ట‌.

ప్ర‌స్తుతం ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ష‌న్ లో నాగార్జున `ఘోస్ట్‌` మూవీ చేస్తున్నారు. ఇది కూడా పోలీస్ డ్రామానే. అయితే గ‌తంలో రాజ‌శేక‌ర్ కు హిట్టివ్వ‌డంతో ఈ డైరెక్ట‌ర్ పై గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నాడు కింగ్. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో వున్న ఈ మూవీ కింగ్ ఆశించిన‌ట్టుగానే సూప‌ర్ హిట్ ని అందించి ఆయ‌న‌ని మ‌ళ్లీ ట్రాక్ లోకి తీసుకొస్తుందా? అన్న‌ది తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌రకు వేచి చూడాల్సిందే.