Begin typing your search above and press return to search.

ఆ రీమేక్‌ చేతులు మారిందా?

By:  Tupaki Desk   |   23 July 2020 1:30 AM GMT
ఆ రీమేక్‌ చేతులు మారిందా?
X
ఈమద్య కాలంలో మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ గురించి మీడియాలో తెగ వార్తలు వస్తూ ఉన్నాయి. తెలుగు తమిళం హిందీల్లో ఈ చిత్రం రీమేక్‌ కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగులో ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ దక్కించుకుంది. భారీ రేటును పెట్టి మరీ సితార వారు రైట్స్‌ ను దక్కించుకుని స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా చేయించారు. కరోనా కారణంగా వారి ప్లాన్‌ అంతా బెడిసి కొట్టింది.

ఇద్దరు హీరోలు ఈ సినిమాలో నటించాల్సి ఉంది. పలువురితో సితార వారు చర్చలు జరిపారు. కాని ఏ ఒక్క జోడీ ఫైనల్‌ కాలేదు. దాంతో వచ్చే ఏడాది వరకు ఈ రీమేక్‌ ను పక్కకు పెట్టాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో రీమేక్‌ రైట్స్‌ ను సితార వారి నుండి స్టార్‌ నిర్మాత ఒకరు తీసుకున్నారట. ఎక్కువ రేటుకు రీమేక్‌ రైట్స్‌ ను కొనుగోలు చేసిన ఆ నిర్మాత ఈ రీమేక్‌ ను భారీ ఎత్తున నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడట.

టాలీవుడ్‌ లో పెద్ద నిర్మాతగా పేరున్న ఆయన ఈ రీమేక్‌ రైట్స్‌ ను దక్కించుకోవడంతో కొందరు హీరోలు కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ దర్శకుడితో ఈ రీమేక్‌ ను రూపొందించేందుకు ఆ నిర్మాత చర్చలు జరుపుతున్నాడు. ఈ ఏడాది చివరి వరకు సినిమాను అధికారికంగా ప్రకటించి వచ్చే ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభించి అదే ఏడాది చివరి వరకు సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయంటూ సమాచారం అందుతోంది.