Begin typing your search above and press return to search.

అన్నయ్యకు అదిరిపోయే సితార గిఫ్ట్‌

By:  Tupaki Desk   |   3 Sep 2018 1:06 PM GMT
అన్నయ్యకు అదిరిపోయే సితార గిఫ్ట్‌
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబంతో ఎక్కువ సమయంను గడిపేందుకు ఇష్టపడతాడు. ఏదైనా సినిమా పూర్తి అయ్యిందంటే వెంటనే ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తూ ఉంటాడు. మహేష్‌ బాబు తన పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న, చేసిన ఫొటోలు ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్న విషయం తెల్సిందే. నమ్రత తన పిల్లలు మరియు మహేష్‌ ల ప్రతి మూమెంట్‌ ను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటూనే ఉంటుంది. ఆ కారణంగా మహేష్‌ బాబు కూతురు సితారకు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడినది. సితార గురించి సోషల్‌ మీడియాలో అనేక సందర్బాల్లో చర్చ జరిగిన విషయం తెల్సిందే.

తాజాగా మరోసారి సూపర్‌ ప్రిన్సెస్‌ సితార సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ఇటీవల మహేష్‌ బాబు తనయుడు గౌతమ్‌ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెల్సిందే. గౌతమ్‌ పుట్టిన రోజును అభిమానులు మరియు కుటుంబ సభ్యులు వైభవంగా జరుపుకున్నారు. అన్న బర్త్‌డేకు సితార ఇచ్చిన గ్రీటింగ్‌ చాలా ప్రత్యేకంగా నిలిచింది. గ్రీటింగ్‌ అంటే వేలకు వేలు పెట్టి కొనుగోలు చేసి ఇవ్వకుండా, తాను సొంతంగా డిజైన్‌ చేసి - విషెష్‌ ను రాసి మరీ సితార తన అన్న గౌతమ్‌ కు ఇవ్వడం జరిగింది. ఆ గ్రీటింగ్‌ లో హ్యాపీ బర్త్‌ డే అన్నయ్య - ఐ లవ్‌ యూ - ఈ సంవత్సరం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను అంటూ రాసింది.

గౌతమ్‌ కు సితార ఇచ్చిన బర్త్‌ డే గ్రీటింగ్‌ ను మహేష్‌ బాబు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సితార పాప తన సొంతంగా తయారు చేసిన గ్రీటింగ్‌ అంటూ మహేష్‌ బాబు కామెంట్‌ కూడా పెట్టాడు. తన అన్నకు సొంతంగా గ్రీటింగ్‌ కార్డును రెడీ చేసి ఇచ్చిన సితార పాప పై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. సితార చూస్తుండగానే పెద్ద పాప అవుతోందని, మహేష్‌ వారసత్వంను నిలుపనుందని సితార గురించి అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ రాస్తూ ఉన్నారు. గతంలో కూడా పలు సార్లు అభిమానుల ప్రశంసలను సితార అందుకున్న విషయం తెల్సిందే.