Begin typing your search above and press return to search.

సీతారామం సినిమా $1M తో ఆగలేదు

By:  Tupaki Desk   |   5 Sep 2022 6:31 AM GMT
సీతారామం సినిమా $1M తో ఆగలేదు
X
సీతారామం సినిమా విడుదల అయ్యి నాలుగు వారాలు పూర్తి అవుతున్నా కూడా ఇంకా కలెక్షన్స్ గురించి చర్చ జరుగుతుంది అంటే ఏ స్తాయిలో సినిమా వసూళ్లను సాధిస్తుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు లో విడుదల అయిన మూడు వారాల తర్వాత హిందీ లో డబ్‌ చేసి అక్కడి ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లారు. అక్కడ మెల్ల మెల్లగా వసూళ్ల జోరు పెరుగుతోంది.

మరో వైపు సీతారామం సినిమా యూఎస్ బాక్సాఫీస్‌ వద్ద సాధిస్తున్న వసూళ్లు అక్కడి వారినే కాకుండా అందరిని కూడా ఆశ్చర్యపర్చుతోంది. సీతారామం సినిమా 1 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధిస్తే చాలా గొప్ప విషయంగా అంతా అనుకున్నారు.

సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో మిలియన్ డాలర్ల వసూళ్లు సీతారామం సినిమాకు పెద్ద కష్టం ఏమీ కాలేదు.

రెండు వారాల తర్వాత సినిమా ఎలాగూ డల్ అవుతుంది... కనుక మిలియన్ డాలర్ల వద్దే వసూళ్లు ఆగిపోతాయి అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రత్యేక సందర్భాలు మరియు ప్రత్యేక షోలు వీకెంట్స్ ఇతర సినిమాలు పోటీ లేకపోవడం వల్ల సీతారామం సినిమా మిలియన్ డాలర్ల నుండి ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల వైపుకు దూసుకు పోతుంది. మరో రోజు లేదా రెండు రోజుల్లోనే ఆ మ్యాజిక్ నెంబర్ ను సీతారామం చేరుకోబోతుంది.

అమెరికాలో ఈ మధ్య కాలంలో ఒక ఇండియన్ సినిమా 1.5 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది అంటే చాలా గొప్ప విషయం గా చెప్పుకోవచ్చు. మలయాళ స్టార్‌ నటుడు దుల్కర్ సల్మాన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో మృనాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించింది.

హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమాను వైజయంతి మూవీస్ వారు నిర్మించిన విషయం తెల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.