Begin typing your search above and press return to search.
సీతారామం కి ఆ ఘనత దక్కిందోచ్!
By: Tupaki Desk | 16 Aug 2022 5:30 AM GMTదుల్కర్ సల్మాన్.. మృనాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన సీతారామం సినిమా రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇంకా సందడి చేస్తూనే ఉంది. తాజాగా సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరింది. స్టార్ లేకుండా..
పెద్దగా అంచనాలు ఏమీ లేకుండా విడుదల అయిన సీతారామం సినిమా ఇంత దూరం వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు. సినిమాకు వచ్చిన క్లాసిక్ టాక్ తో ఈ భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.
సీతారామం సినిమా కు పోటీగా వచ్చిన బింబిసార కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రెండు సినిమాలు కూడా వసూళ్ల విషయంలో పోటీ పడ్డాయి.
రెండు సినిమాలకు కూడా సాలిడ్ వసూళ్లు నమోదు అయ్యాయి. సోలో రిలీజ్ అయ్యి ఉంటే సీతారామం మరో మూడు నాలుగు రోజుల ముందుగానే 50 కోట్ల మార్క్ చేరుకునేది అంటూ బాక్సాఫీస్ వర్గాల టాక్.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతారామం సినిమా ను అశ్వినీదత్ నిర్మించిన విషయం తెల్సిందే. సినిమా లో దుల్కర్ సల్మాన్ ను నటింపజేయడం అనేది చాలా పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు సీతారామం తెలుగు సినిమానేనా లేదా డబ్బింగ్ సినిమానా అంటూ తెలుగు ప్రేక్షకుల్లో చర్చ కూడా జరిగింది.
అలాంటి సీతారామం విడుదల తర్వాత ఒకే ఒక్క టాక్.. బాగుంది అని. సినిమాకు టాక్ వచ్చినా వసూళ్లు రాకపోవడం ఈ మధ్య కాలంలో జరిగింది. కాని సీతారామం సినిమా కు మాత్రం మంచి టాక్ రావడంతో పాటు మంచి వసూళ్లు కూడా నమోదు అయ్యాయి. సీతారామం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ మరియు మృనాల్ లు టాలీవుడ్ లో బిజీ అవ్వనున్నారు.