Begin typing your search above and press return to search.

ఆ క్రేజీ ప్రాజెక్టులోకి 'సీతారామం' బ్యూటీ..!

By:  Tupaki Desk   |   24 Oct 2022 5:43 AM GMT
ఆ క్రేజీ ప్రాజెక్టులోకి సీతారామం బ్యూటీ..!
X
బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ 'సీతారామం'తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఈ సినిమాలో సీతగా ఆమె నటించిన తీరుకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కడంతోపాటు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఏర్పడింది. మృణాల్ నటనకు ఫిదా అయిన యూత్ ఆమెకు వీరాభిమానులుగా మారిపోయాయి.

దాదాపు 30కోట్లతో తెరకెక్కిన 'సీతారామం' 105కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. మృణ ఠాకూర్ తన తొలి తెలుగు సినిమాతోనే వంద కోట్ల క్లబ్బులో చేరడంతో ఆమె లక్కీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈక్రమంలోనే పలువురు దర్శక, నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

'సీతారామం' మూవీ విడుదలై మూడు నెలలు గడుస్తున్నా ఆమె తన కొత్త ప్రాజెక్టును ఇప్పటివరకు ప్రకటించలేదు. ఆమె ఈ మూవీ సక్సస్ బాగా చేస్తున్నట్లు కన్పిస్తోంది. అయితే ఆమె తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఈ కారణంగానే ఆమె తన తదుపరి ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదని తెలుస్తోంది.

'ఆర్ఆర్ఆర్'తో ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్.. తన నెక్ట్ సినిమాను దర్శకుడు కొరటాలతో చేస్తున్నాడు. 'ఆచార్య' ప్లాపుతో నిరాశలో ఉన్న కొరటాల శివ 'ఎన్టీఆర్30'తో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా మృణా ఠాకూర్ ను తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. మృణల్ సైతం ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో నటించేందుకు ఆసక్తి చూపుతోంది.

ఈనేపథ్యంలో వీరి కాంబినేషన్ ను సెట్ చేసేందుకు కొరటాల ప్రయత్నిస్తున్నారట. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ విన్పిస్తోంది. సీత(మృణాల్ ఠాకూర్) ఆశను నందమూరి తారక రాముడు(ఎన్టీఆర్) తీరుస్తాడో ఏమేరకు తీరుస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే 'సీతారామం'లో చాలా సంప్రదాయంగా కన్పించిన మృణాల్ ఠాకూర్ నిజజీవితంలో మాత్రం పూర్తిగా విభిన్నంగా కన్పిస్తోంది. టాలీవుడ్ వెండితెర అచ్చతెలుగు అమ్మాయిగా కన్పించిన ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ బికినీ ఫొటోలతో రచ్చ చేస్తోంది. ఏదిఏమైనా స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్న సీతారామం బ్యూటీకి తాను కోరుకుంటున్న క్రేజీ ప్రాజెక్టు దక్కాలని కోరుకుందాం..!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.