Begin typing your search above and press return to search.

మహేష్ కూతురు అదరగొట్టేసింది

By:  Tupaki Desk   |   29 April 2018 4:51 PM IST
మహేష్ కూతురు అదరగొట్టేసింది
X
మహేష్ బాబు ముద్దుల కూతురు సితారకు సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. చాలా క్యూట్ గా కనిపించే ఈ అమ్మాయి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తుంటాయి. అప్పుడప్పడూ తన అల్లరి చేష్టలకు సంబంధించిన ఫొటోలు.. వీడియోలు కూడా అక్కడ కనిపిస్తుంటాయి. మహేష్ బాబుతో కలిసి షూటింగ్ కు వెళ్లి అక్కడ అతడి కో ఆర్టిస్టులతో కలిసి సందడి చేస్తూ కెమెరాలకు దొరుకుతూ ఉంటుంది సితార. ఆమె గతంలో ‘స్పైడర్’ సినిమాలోని ఒక పాట పాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా సితార మరోసారి గొంతు సవరించుకుంది. తన తండ్రి కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ నుంచి ఒక పాట పాడి అలరించింది. ఇందులో హీరోయిన్ పాడుకునే ఇది కలలా ఉన్నదే.. అనే పాటతో సితార సందడి చేసింది.

‘భరత్ అనే నేను’లోని కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించిన అసెంబ్లీ సెట్ కు సితార వెళ్లిన సందర్భంలో ఇది కలలా ఉన్నదే పాటను పాడుతున్నపుడు కెమెరాకు చిక్కింది. అక్కడ ఆ పాప చాలా ముద్దుగా ఈ పాట పాడుతూ అందరినీ ఆకర్షించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘భరత్ అనే నేను’ ఫలితంతో ఇప్పుడు మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంది. రెండు వరుస డిజాస్టర్ల తర్వాత మహేష్ బాబుకు ఈ చిత్రం చాలా ఉపశమనం అందించింది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ చాలా ఉద్వేగంగా.. సంతోషంగా కనిపిస్తున్నాడు. తన భార్యకు ప్రేమతో ముద్దిస్తూ ఉన్న ఒక ఫొటోను కూడా అతను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు. నమ్రత కూడా సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే సితార వీడియో కూడా బయటికి వచ్చింది.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి