Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియోః అమ్మమ్మను అనుకరించిన సీతూపాప

By:  Tupaki Desk   |   9 March 2021 9:05 AM IST
వైరల్‌ వీడియోః అమ్మమ్మను అనుకరించిన సీతూపాప
X
సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు కూతురు సితార ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. సీతూ పాప తన ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫొటోలు వీడియోలను షేర్‌ చేస్తూ ట్రెండ్డింగ్‌ లో ఉంటుంది. ప్రస్తుతం సితారను ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉన్నారు. తన ఫాలోవర్స్ కోసం ఈసారి సీతూపాప తన అమ్మమ్మ మీనాక్షి శిరోద్కర్‌ ను అనుకరించింది. మీనాక్ష్మి పాత సినిమా లో ఒక పాటలో భాగంగా స్విమ్మింగ్‌ పూల్‌ లో ఉన్న షాట్ ను సితార చేసింది.

యమున జలి ఖేలు ఖేల్ పాటలో మీనాక్ష్మి శిరోద్కర్‌ ఎలా అయితే చేశారో అచ్చు అలాగే సితార చేసేందుకు ప్రయత్నించింది. సితార షేర్‌ చేసిన ఈ క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోను షేర్‌ చేసిన సితార నా ఎడమ వైపు వీడియోలో ఉన్నది అమ్మమ్మ మీనాక్షి శిరోద్కర్‌. నేను ఆమె పాటను ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించాను. నేను న్యాయం చేశాను అని భావిస్తున్నాను అంటూ కామెంట్ పెట్టింది. సితార చిన్నప్పటి నుండే సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ట్రెండ్‌ అవుతూ వస్తుంది. ఇప్పుడు సొంతంగా సోషల్ మీడియా అకౌంట్ ను తీసుకుని అందులో వీడియోలను షేర్‌ చేస్తూ మహేష్‌ అభిమానులను ఎంటర్‌ టైన్‌ చేస్తోంది.